టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా కాదు. అక్కినేని నాగేశ్వరరావు కారణంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి నాగార్జున కుటుంబం పూర్తిగా ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున తో పాటు ఆయన కొడుకులు అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని అఖిల్ కూడా ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలకు మంచి హిట్టు లేకపోయినప్పటికీ… ఫాలోయింగ్ మాత్రం బీభత్సంగా ఉంది.
Advertisement
అయితే అక్కినేని నాగార్జునకు రెండు పెళ్లిళ్లు జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. మొదటి భార్య కుమారుడు నాగచైతన్య అయితే అమల కుమారుడు అఖిల్. అయితే నాగచైతన్యను అఖిల్ కంటే ఎక్కువ చూసుకుంటారు నాగార్జున మరియు అమల. ప్రతి దాంట్లో నాగచైతన్యకు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇలాంటి తరుణంలో అక్కినేని నాగార్జున భార్య అమల గురించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
Advertisement
అఖిల్ పుట్టిన తర్వాత… ఒక్కడే ఉన్నాడు కదా… మరో సంతానం కోసం ప్లాన్ చేద్దామని అమలను నాగార్జున అడిగాడట. మనకు ఒక్క అఖిల్ ఉండటం ఏంటి ? నాగచైతన్య కూడా మన కొడుకే అంటూ అమల సమాధానమిచ్చిందట. నాగచైతన్య మరియు అఖిల్ ఇద్దరు మనకు చాలు.. మరొకరు ఎందుకు అంటూ తెలిపిందట అక్కినేని అమల. ఇక అక్కినేని అమల చేసిన ఈ కామెంట్‌తో నాగార్జున కూడా షాక్ అయ్యాడట. ఆమె మాతృత్వాన్ని మెచ్చుకొని ఫిదా అయిపోయాడట. ఇప్పుడు ఇదే అంశం టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
ఇవి కూడా చదవండి
ఆస్పత్రిలో చేరిన బండ్ల గణేష్.. ఆందోళనలో ఫ్యాన్స్ ?
మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు : పవన్ కళ్యాణ్
ధోని కుట్ర చేశాడు.. కావాలనే రన్ అవుట్ అయ్యాడు – యువరాజ్ తండ్రి సంచలనం