ప్రపంచ దేశాల్లోనే నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశం భారత దేశం. ఎన్నో రవాణా సదుపాయాలున్నప్పటికీ.. రైల్వే వ్యవస్థ ప్రత్యేకమైనది. భారత దేశానికీ వచ్చిన అమూల్యమైన వారసత్వ సంపదలలో రైల్వే వ్యవస్థ కూడా ఉంటుంది. ఇండియన్ రైల్వే పేరిట.. భారత రైలు వ్యవస్థ దేశంలోని నలుమూలల్లోను వ్యాపించి ఉంది. దేశంలో ఏ రాష్ట్రములో అయినా అన్ని ఊర్లనూ కలుపుతూ రైల్వే వ్యవస్థ ఉంటుంది.
Advertisement
అయితే.. భారత దేశంలో కేవలం ఒక్క రైల్వే స్టేషన్ మాత్రమే ఉన్న రాష్ట్రము ఉందని తెలుసా? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 8 వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్న భారత దేశంలో ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉన్న రాష్ట్రము ఉండడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. భారత దేశంలో మిజోరాం రాష్ట్రంలో ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ పేరు బైరాబీ రైల్వే స్టేషన్.
Advertisement
రాకపోకల కోసం ప్రజలు ఈ ఒక్క రైల్వే స్టేషన్ పైనే ఆధారపడుతున్నారు. రాష్ట్రంలోని కొలాసిబ్ జిల్లాలో ఈ రైల్వే స్టేషన్ ఉంది. కేవలం ప్రయాణికుల రాకపోకలు మాత్రమే కాకుండా.. సరకుల రవాణాని కూడా ఈ స్టేషన్ నుంచే చేస్తుంటారు. గతంలో ఈ స్టేషన్ చాలా చిన్నదిగా ఉండేది. ప్రస్తుతం కొంత అభివృద్ధి చేసారు. ఒకే ఒక్క స్టేషన్ ఉండడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరో స్టేషన్ నిర్మించాలని కోరుతున్నారు. ఇప్పటికే ఈ విషయమై రైల్వే శాఖ ప్రతిపాదనలు చేసింది. రైల్వే కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే యోచనలో కూడా రైల్వే శాఖ ఉంది.
మరిన్ని:
ధోని కుట్ర చేశాడు.. కావాలనే రన్ అవుట్ అయ్యాడు – యువరాజ్ తండ్రి సంచలనం
టెస్టు క్రికెట్ కు వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్
MS Dhoni Assets : ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?