ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలా మంది నటులకు తొలుత నటనపై ఆసక్తి ఉండి ఇండస్ట్రీలోకి రాలేదు. ఇండస్ట్రీలోకి రాకముందు వారు కొన్ని రకాల స్పోర్ట్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారి ప్రొఫెషనల్ గా కూడా ఆటగాళ్లుగానే ఎదిగిన తరువాత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన వారిలో చాలా మంది స్టార్ హీరోలుగా ఎదిగారు. మరి వారెవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
సుమన్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఎదిగిన సుమన్ ఇండస్ట్రీలోకి రాక ముందు అంతర్జాతీయ కరాటే క్రీడాకారుడు. ఈయన జాతీయ, అంతర్జాతీయ పోటీలకు ప్రాతనిథ్యం వహించారు. ఏపీ కరాటే అసోసియేషన్ చైర్మన్ కూడా చేసారు. ఇక ఆ తరువాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ట్ అయ్యారు.
ఆదర్శ్ బాలకృష్ణ
బిగ్ బాస్ కంటెస్టెంట్, టాలీవుడ్ లో మంచి నటుడిగా గుర్తింపు సంపాదించిన ఆదర్శ క్రికెట్ లో మంచి పట్టు ఉన్న వ్యక్తి. హైదరాబాద్ జట్టుకి ప్రాతినిథ్యం వహిస్తూ.. రంజీ లాంటి టోర్నమెంట్ లలో కూడా ఆడారు. ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నారు.
Advertisement
సుధీర్ బాబు
అందరికీ పరిచయం ఉన్న నటుడు సుధీర్ బాబు ప్రొఫెషనల్ పరంగా బ్యాడ్మిండన్ ఆటగాడు. చాలా సార్లు జాతీయ క్రీడలకు రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహించాడట. పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ ఆడుతున్న సమయంలోనే సుధీర్ తన టాలెంట్ ని బయట పెట్టుకున్నారు. ఇండస్ట్రీలోనే భలే మంచి రోజు,కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ వంటి సినిమాల్లో నటించి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
భాను చందర్
భాను చందర్ కూడా సినీ ఇండస్ట్రీలోకి రాకముందు కరాటే మార్షల్ ఆర్ట్స్ లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో విజయాలు సాధించాడు.
నాగశౌర్య
ఈ హీరో కూడా ఒకప్పుడు టెన్నిస్ ఆటగాడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. జాతీయస్థాయి క్రీడల్లో కూడా పాల్గొన్నాడు. ఊహలు గుసగుసలాడే అశ్వద్ధామ వంటి సినిమాల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
టీ 20 జట్టులో కోహ్లీ-రోహిత్ లేకపోవడాని కారణం ఏంటి..? టీమిండియా మాజీ కెప్టెన్ ఫైర్..!