Home » MS Dhoni Assets : ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

MS Dhoni Assets : ఎంఎస్ ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

by Bunty
Ad

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ మరే క్రికెటర్ కు లేదన్న మాట అందరూ ఒప్పుకోవాల్సిందే. తన కెరీర్ ప్రారంభం నుంచి టీమిండియా కు అనేక విజయాలు అందించాడు మహేంద్ర సింగ్ ధోని. టీమిండియా కు తన కెప్టెన్సీలో ఏకంగా మూడు ఐసీసీ టోర్నమెంట్లు కూడా అందించిన ఘనత ధోని ఖాతాలో ఉంది. 2007 టి20 ప్రపంచ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ నీ టీమిండియా కు అందించి.. చరిత్ర సృష్టించాడు మహేంద్ర సింగ్ ధోని.

Advertisement

2004 సంవత్సరంలో టీమిండియాలోకి వచ్చిన మహేంద్ర సింగ్ ధోని… 2020 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఇక ప్రస్తుతం ధోని చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా… తాజాగా మహేంద్ర సింగ్ ధోని ఆస్తుల గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహేంద్రసింగ్ ధోని ఆస్తులు మరియు సంపాదనపై స్టాక్ బ్రో అనే కంపెనీ ఒక పోస్ట్ పెట్టింది. మహేంద్ర సింగ్ ధోని మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ. 1040 కోట్లు అని స్పష్టం చేసింది.

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై నుంచి ఏకంగా 12 కోట్లు, బ్రాండ్ల ఎండార్స్మెంట్ ద్వారా నాలుగు నుంచి ఆరు కోట్లు సంపాదిస్తున్నాడని తెలిపింది. సోషల్ మీడియా… ఫీజు ద్వారా ఒక కోటి నుంచి రెండు కోట్ల వరకు ధోని అర్జిస్తున్నాడని సదరు సంస్థ తెలిపింది. అలాగే వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెట్టారని పేర్కొంది. అంతేకాదు డోలు దగ్గర ఎన్నో విలువైన కారణం మరియు బైక్స్ ఉన్నాయని ఆ సంస్థ తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరోసారి ఇండియా కెప్టెన్ గా విరాట్ కోహ్లీ !

Mohammed Shami : షమీ అరెస్ట్ తప్పదా? కీలక ఆదేశాలు ఇచ్చిన సుప్రీం కోర్టు

2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..

 

Visitors Are Also Reading