Home » దానవీరశూరకర్ణలో సినిమాలో ఏఎన్నార్ కి ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చినా వద్దన్నారట..ఎందుకో తెలుసా ?

దానవీరశూరకర్ణలో సినిమాలో ఏఎన్నార్ కి ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చినా వద్దన్నారట..ఎందుకో తెలుసా ?

by Anji
Ad

నందమూరి తారకరామావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ ప్రేక్షకులకు ఆయన దేవుడి రూపంలో కొలుస్తారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అప్పటివరకు రాముడు,  కృష్ణుడు ఎలా ఉంటారో తెలియని వారు వెండితెరపై ఇలాగే ఉంటారని చూపించారు సీనియర్ ఎన్టీఆర్. పౌరాణిక సినిమాల్లో ప్రతీ రోల్ ఎన్టీఆర్ పోషించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకున్నారు. కొందరూ అయితే దేవుడు ఎలా ఉంటాడో తెలియక ఏకంగా ఆయన సినిమా పటాలను ఇంట్లో పెట్టుకొని పూజించే వారు ఉన్నారంటే మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఎన్టీఆర్ ఎంతటి మహానుభావుడో.. ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా కొన్ని చిత్రాలకు దర్శక, నిర్మాతలుగాను వ్యవహరించేవారు. 

Advertisement

ఆయన స్వీయ దర్శకత్వంతో పాటు నటించిన సినిమా ఏదైనా ఉందంటే.. 1977లో వచ్చిన దానవీర శూరకర్ణ. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రలను పోషించారు.  కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు ఈ మూడు పాత్రల్లో లీనమైపోయారు. ఈ చిత్రం విడుదలైన తరువాత బాక్సాఫీస్ ను షేక్ చేసిందనే చెప్పాలి. ఇక అదే సమయంలో సూపర్ స్టార్ కృష్ణ కురుక్షేత్రం సినిమా రిలీజ్ అవ్వగా.. ఎన్టీఆర్ సినిమా హిట్ అవ్వగా కృష్ణ నటించిన మూవీ ప్లాఫ్ అయింది. ఈ ధానవీరశూరకర్ణ మూవీ అప్పట్లో రూ.10లక్షలు ఖర్చుతో తీయగా ఏకంగా రూ.కోటికి పైగా కలక్షన్లను వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. 

Advertisement

ఈ చిత్రాన్ని మళ్లీ 1994లో థియేటర్లలో రెండోసారి కూడా విడుదల చేయగా.. అప్పుడు కూడా జనం ఎగబడి మరీ వీక్షించారు. ఎన్టీఆర్ సినిమాలకు అంత క్రేజ్ ఉండేది మరీ. ఎన్టీఆర్ సినిమాలు అంటే జనాలు ప్రాణాలు ఇచ్చేవారని తెలిసిందే.  దానవీరశూరకర్ణ సినిమాలో దర్శకుడిగా ఎన్టీఆర్.. ఏఎన్నార్ ని ఈ సినిమాలో నటించాలని కోరారు. కృష్ణుడు లేదా కర్ణుడి పాత్రలను ఇచ్చారట. అంతకు ముందు వచ్చిన సినిమాల్లో ఎన్టీఆర్ ని ప్రజలు కృష్ణుడిగా చూసారు. మళ్లీ నేను చేస్తే.. ప్రజలు నన్ను అంగీకరించారని చెప్పాడట. ఇక కర్ణుడి పాత్ర చేయాలని చెప్పగా..పాండవులు తనకు మరగుజ్జులుగా కనిపిస్తారని దీనికి నేను న్యాయం చేయలేనని బదులిచ్చారట.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

వైయస్ షర్మిల కొడుకును చూశారా….అచ్చం హీరోలా ఉన్నాడు !

 Sourav Ganguly : తిరుపతిలో రహస్యంగా పెళ్లిచేసుకున్న గంగూలీ – నగ్మా!

Visitors Are Also Reading