Home » ధనుష్ పెళ్లి ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రవాడిని గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఇతగాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..

ధనుష్ పెళ్లి ఫోటోలో కనిపిస్తున్న ఈ కుర్రవాడిని గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఇతగాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్..

by Mounika
Ad

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి విషయం క్షణంలో వైరల్ అవుతుంది. సాధారణ వ్యక్తి నుంచి సెలబ్రిటీల వరకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని తమకు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటున్నారు. సెలబ్రిటీలు సైతం అభిమానులకు మరింత దగ్గర అవ్వటానికి తమకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించడంతోపాటు, వారి చిన్ననాటి ఫోటోలు కూడా షేర్ చేస్తున్నారు. ఇక ఆ ఫొటోస్ కాస్త క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఓ ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తమిళ్ హీరో ధనుష్ సంబంధించిన పెళ్లి ఫోటోలు షేర్ చేయడంతో జరిగింది. ఆ ఫోటోలో ఒక ఉన్న చిన్న కుర్రవాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ధనుష్, ఐశ్వర్య పెళ్లి గ్రూప్ ఫోటోలో ఉన్న ఈ చిన్నోడు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..? ఈ ఫోటోలో కనిపించే చిన్నవాడు ప్రస్తుతం ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్. ఇతను అందించే మ్యూజిక్ కి ఎలాంటివారైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. ఒక్కోసారి మెలోడీ సాంగ్స్ తో మెస్మరైజ్ చేస్తూనే.. మరోసారి మాస్ సాంగ్స్ తో అభిమానులను ఉర్రూతలూగిస్తాడు.

 

 

ఈ ఫోటోలో కనిపించే కుర్రవాడు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించి ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు.. ఇతడు స్వరపరిచిన వై దిస్ కొలవరి ఢీ పాటతో మంచి గుర్తింపునందుకున్నాడు. ఇంకా ఇతను ఎవరో గుర్తుపట్టలేదా..? అతనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్. ధనుష్ పెళ్లి ఫోటోలో అనిరుధ్ ని చూసినవారు సైతం… ధనుష్ పెళ్లి నాటికి అనిరుధ్ ఇంత చిన్నవాడా అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అనరుధ్ 16 అక్టోబరు 1990లో తమిళనాడు రాష్ట్రం, మద్రాస్ లో జన్మించారు. అనిరుధ్ తండ్రి రవి రాఘవేంద్ర తమిళ టెలివిజన్ మరియు సినీ నటుడు. ఈయన సూపర్ స్టార్ రజనీకాంత్ సతీమణి లతా కి స్వయానా సోదరుడు అవుతాడు. చెన్నైలోని లయెలా కాలేజీ నుండి డిగ్రీ పూర్తి చేసుకున్న అనిరుధ్ సినిమాలపై మక్కువతో మ్యూజిక్ డైరెక్టర్ గా ధనుష్ మరియు శృతిహాసన్ నటించిన మూడు చిత్రం ద్వారా పరిచయం అయ్యాడు. కేవలం ఒక తమిళ భాషలోనే కాక తెలుగు, మలయాళం, హిందీ వంటి చిత్రాలకు కూడా సంగీతాన్ని అందించాడు. నాని గ్యాంగ్ లీడర్, కమల్ హాసన్ విక్రమ్, విజయ్ బీస్ట్ వంటి చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. అంతేకాకుండా తమిళ్ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్గా ఫిలింఫేర్ అవార్డును కూడా దక్కించుకున్నాడు అనిరుధ్.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

కాంతారా 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన రిషబ్ శెట్టి.. సినిమా ఎప్పుడంటే..?

మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ.. అతను ఎవరో తెలుసా ?

మెగా హీరోల కూతుళ్లకు ఎందుకు ఇలా జరుగుతోంది.. ఏమైనా శాపం ఉందా..?

Visitors Are Also Reading