వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీ మన ఇండియాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు అంటే దాదాపు 40 రోజులకు పైగా వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లు ఇండియాలో జరగనున్నాయి.
Advertisement
ఈ మేరకు బీసీసీఐ కూడా అన్ని గ్రౌండ్ లను సిద్ధం చేసింది. అటు హైదరాబాద్ మహానగరంలో ఏకంగా మూడు మ్యాచ్లు జరగనున్నాయి. కానీ హైదరాబాద్ లో టీమిండియా మాత్రం ఒక్క మ్యాచ్ కూడా ఆడటం లేదు. అటు ఈ వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ జట్టు కూడా ఇండియాకు రానుంది.
Advertisement
ఇక ఇది ఇలా ఉండగా, ఇండియా వేదికగా జరగనున్న వరల్డ్ కప్ పై పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజామ్ కీలక వాక్యాలు చేశారు. ‘మేము ఇండియాపై ఆడేందుకు కాదు… వరల్డ్ కప్ ఆడేందుకు వెళ్తున్నాం. మా ఫోకస్ ఒక్క టీం పై లేదు. మా ఫోకస్ వరల్డ్ కప్ లోని పది టీమ్స్ పై ఉంది. అన్ని మ్యాచుల్లో అద్భుతమైన ప్రదర్శన తో ఫైనల్ కు చేరుకొని వరల్డ్ కప్ గెలవడమే మా ధ్యేయం’ అని బాబర్ మీడియాతో మాట్లాడారు. ఈ వాక్యాలు వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
Rangabali Movie Review : రంగబలి మూవీ రివ్యూ..నాగశౌర్య హిట్టు కొట్టినట్టేనా ?
ఎంగేజ్మెంట్ కాగానే.. ఆ పని మొదలు పెట్టిన లావణ్య త్రిపాఠి !
WI VS IND TOUR : కెప్టెన్‌గా పాండ్యా.. తెలుగు కుర్రాడికి చోటు