Home » దిల్ రాజు కొడుకు కోసం శ్రీలీల ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

దిల్ రాజు కొడుకు కోసం శ్రీలీల ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్నటువంటి అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు.  ఓ వైపు నిర్మాతగా వ్యవహరిస్తూనే.. మరోవైపు డిస్ట్రీబ్యూటర్ గా కొనసాగుతున్నారు దిల్ రాజు.  ఈయన తొలుత  భార్య మరణించడంతో..  మూడేళ్ల కిందట తేజస్విని  ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ దంపతులకు గత ఏడాది జూన్ 29న కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడికి అన్వై పేరు పెట్టారు. ఇటీవల దిల్ రాజు కుమారుడి అన్వై పుట్టిన రోజు వేడుకలు హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

 

అయితే పుట్టిన రోజు వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, మహేష్ బాబు ఆయన కూతురు సితార, త్రివిక్రమ్, మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, డైరెక్టర్లు బోయపాటి శ్రీను, గోపిచంద్, ప్రియదర్శి, త్రినాథరావు నక్కిన, శివ నిర్వాణ, శైలేష్ కొలను, యంగ్ హీరోయిన్ శ్రీలీల, గౌతమ్ తిన్ననూరి చాలా వరకు హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు ఇలా పలువురు పాల్గొని సందడి చేశారు.

Advertisement

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ తెగ వైరల్ గా మారాయి. ఈ వేడుకలో మొత్తం స్పెషల్ అట్రాక్షన్ గా శ్రీలీలనే నిలిచింది. ఎంతో మంది సెలబ్రెటీలు వచ్చినా.. కెమెరాలన్నీ కూడా శ్రీలీల వైపు చూడటం విశేషం. ఇందుకు అసలు కారణం రెడ్ ఫ్రాక్ లో శ్రీలీల చాలా అట్రాక్టివ్ గా కనిపించింది. దీంతో చాలా సింపుల్ లుక్ లో దిల్ రాజు కొడుకుతో ఆడిపాడిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. ఎవ్వరూ పిలిచినా వారి వద్దకు వెళ్లని దిల్ రాజు కొడుకు శ్రీలీల పిలవగానే నవ్వుకుంటూ.. వెళ్లిపోయాడట. అంతేకాదు.. దిల్ రాజు కొడుకు కోసం భారీ స్థాయిలోనే ఖర్చు చేసి రకరకాల బొమ్మలను తీసుకువెళ్లిందట శ్రీలీల. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు 

హీరోయిన్ రెబా మోనికకి ఈ స్టార్ హీరోయిన్ బంధువా..?

“అతడు” సినిమాలో బ్రహ్మానందం కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా?

నిహారిక, చైతన్య విడాకులకు క్లారిటీ వచ్చేసిందా..? అందుకోసమే వారు విడాకులు తీసుకుంటున్నారా..?

Visitors Are Also Reading