మనం ప్రతి రోజు అన్నం తింటూ ఉంటాము. అన్నం తినేటప్పుడు బియ్యాన్ని కడిగి ఒక సారి ఆ తర్వాత కుక్కర్లో వేసి నీళ్లు పోసి స్టవ్ మీద పెడుతూ ఉంటాము. అయితే అన్నం వండేటప్పుడు ఎందుకు బియ్యాన్ని కడగాలి..? బియ్యం కడగకుండా అన్నం వండుకుంటే ఏమవుతుంది.. బియ్యం కడిగి వండడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఎవరైనా కూడా అన్నాన్ని వండేటప్పుడు బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు కడుగుతారు.
Advertisement
ఆ తర్వాత సరిపడా నీళ్లు పోసి స్టవ్ మీద పెడుతుంటారు. అన్నం వండడానికి ముందు బియ్యాన్ని కడిగితే దుమ్ము, ధూళి అన్నీ కూడా తొలగిపోతాయి. అదే విధంగా గడ్డి, చిన్నచిన్న పురుగులు ఏమైనా ఉంటే పోతాయి. అందుకని ఒక సారి బియ్యాన్ని కడుక్కోవడం మంచిది. పైగా మనం ఒకసారి కడగడం వలన అధికంగా స్టార్చ్ ఉన్నట్లయితే తొలగిపోతుంది. అన్నం వండిన తరవాత విలవిలలాడుతూ వస్తుంది. కొన్ని రకాల బియ్యం కి జిగట పొర ఉంటుంది పిండి పదార్థం వలన ఇది రాదు.
Advertisement
వంట సమయంలో విడుదల అయ్యే అమిలోపాక్టాన్ కారణంగా ఈ జిగట అనేది వస్తుందని స్టడీ చెప్తోంది. బియ్యాన్ని ఒకసారి కడిగితే దానిలో ఉండే 90% వ్యర్ధాలు అన్నీ కూడా పోతాయి. ఇప్పుడు టెక్ యుగం వలన క్విక్ రెడీ రైస్ అందుబాటులోకి వస్తోంది. మైక్రో ప్లాస్టిక్స్ అనేక రకాలుగా బియ్యం లోకి వస్తాయి. బియ్యం కడిగితే 40% మైక్రో ప్లాస్టిక్స్ వంట చేయడానికి ముందు బయటకి వెళ్ళిపోతాయి అని పరిశోధన చెప్తోంది కానీ ఎక్కువసార్లు బియ్యం కడిగితే అందులో ఉండే పోషకాలు తగ్గిపోతాయి. బియ్యాన్ని అధికంగా కడగకండి. అందులోనూ అన్నం మాత్రమే తినేవాళ్లు ఎక్కువగా కడిగితే పోషకాలు పోతాయి.
Also read:
ఉపాసన డెలివరీ కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టారా?
రామ్‌చరణ్ కూతురికి అంబానీ అత్యంత ఖరీదైన గిఫ్ట్!
ఒక్క యాడ్ కోసం.. రాజమౌళి ఎంత పారితోషకం తీసుకున్నారు అంటే..?