సాధారణంగా మనం ఎన్నో సినిమాలను చూస్తుంటాం. ఒకే తండ్రికి ఇద్దరు భార్యలుంటారు. కానీ తండ్రి ఒకరైన ఇద్దరు తల్లులకు పుట్టిన పిల్లలు ఒకరినొకరు ద్వేషించుకోవడం. వాళ్లు పెరిగే కొద్ది శత్రువులగా మారడం జరుగుతుంటుంది.
Advertisement
మన తెలుగు సినీ చరిత్రలోనే రెండో పెళ్లి చేసుకున్న టాప్ హీరోల పిల్లల చాలా మంది అలా ఒకరి మీద ఒకరు యుద్ధానికి దిగకుండా కలిసి మెలిసి ఉంటున్నారు. వీరు ఎంతో అన్యోన్యంగా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఒకే తల్లికి పుట్టకపోయిన కలిసి మెలిసి ఉంటున్న మన సెలబ్రిటీ హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ లిస్ట్ లో ముందు ఉన్న సెలబ్రిటీలు అక్కినేని నాగార్జున కొడుకులు నాగచైతన్య అఖిల్, ఇందులో నాగచైతన్య నాగార్జున ఫస్ట్ భార్య దగ్గుబాటి లక్ష్మీ కుమారుడు. అఖిల్ నాగార్జున ప్రేమించి పెళ్లి చేసుకున్న అమల కొడుకు. వీరిద్దరూ ఎప్పుడూ కలిసి మెలిసి ఉంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే.
ఈ లిస్ట్ లో హరికృష్ణ గారి ఇద్దరు కొడుకులు కళ్యాణ్ రామ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ నిలుస్తారు. హరికృష్ణ అఫిసియల్ గానే రెండు పెళ్లిళ్లను చేసుకున్నారు. మొదటి భార్యకు కళ్యాణ్ రామ్, రెండో భార్య జూనియర్ ఎన్టీఆర్ పుట్టారు. వీరిద్దరూ ఎప్పుడూ ఒకరికొకరూ గౌరవం ఇచ్చుకుంటూ సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలే హరికృష్ణ మరణించడంతో వీరి మధ్య అనుబంధం మరింత పెరిగిందనే చెప్పవచ్చు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి ముగ్గురు పిల్లలు కూడా ఈ లిస్ట్ లోకి వస్తారు. ముగ్గురిలో విష్ణు, లక్ష్మీలు మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవి గారికి జన్మిస్తే.. మనోజ్ మాత్రం మోహన్ బాబు రెండో భార్య నిర్మలదేవికి జన్మించారు. వీరు ముగ్గురు ఒకతల్లికి పుట్టలేదంటే ఎవ్వరూ నమ్మరు. వీరి అనుబంధం అలా ఉంటుంది.
Advertisement
సూపర్ స్టార్ కృష్ణ ఇద్దరు అబ్బాయిలు నరేష్, మహేష్ బాబు కూడా ఒక తల్లికి పుట్టకపోయిన ఎఫ్పుడూ కలిసి మెలిసి ఉంటున్నారు. ఇటీవలే కృష్ణ మరణించిన విషయం తెలిసిందే.
ఈ లిస్ట్ లో అప్పటి టాప్ హీరోయిన్స్ నగ్మా అండ్ జ్యోతిక కూడా ఉన్నారు. వీరు కూడా ఒక తల్లికి పుట్టిన కూతుర్లు కాకపోయినా అటు రీల్ లైఫ్ లో ఇటు రియల్ లైఫ్ లో ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసి మెలిసి ఉంటారు.
ఇక ఒకప్పటి హీరో ఇప్పుడు మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా విజయ్ కుమార్ గారు కూడా రెండు పిల్లలు చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు. ఫస్ట్ భార్యకు కొడుకు అరుణ్, విజయ్ ఇప్పుడు తమిళ్ లో టాప్ హీరో అండ్ రెండో భార్యకు ముగ్గురు పిల్లలు అందులో ప్రభాస్ మొదటి సినిమా హీరోయిన్ శ్రీదేవి కూడా ఒకరు. వీళ్లిద్దరు కూడా ఎలాంటి గొడవలు లేకుండా హాయిగా ఉంటారు.
ఇక శ్రీదేవి భర్త బోణి కపూర్ గురించి మనందరికి తెలిసిందే.ఈయనకు కూడా ఇద్దరిని పెళ్లిచేసుకున్నాడు.అయితే మొదటి భార్య కొడుకు అర్జున్ కపూర్ ఇప్పుడు హీరోగా రాణిస్తుంటే రేండోవ భార్య శ్రీదేవికి జాన్వీ కపూర్ అనే కూతురు ఉంది.ఇప్పుడు శ్రీదేవి లేకపోయినా సొంత అన్నలా అర్జున్ కపూర్ జాన్విని బాగా చూసుకుంటాడు. అదేవిధంగా ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీ ఖాన్.అమ్రితా సింగ్ అనే అమ్మాయిని చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసుకొని… సారా అలీఖాన్ మరియు ఇబ్రహీం లకు జన్మనిచ్చాడు. ఆ తర్వాత కరీనా కపూర్ ను రెండో పెళ్లి చేసుకుని సారా, ఇబ్రహీం లకు ఒక బ్రదర్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు.ఇప్పుడు కరీనా మళ్ళీ కడుపుతో ఉంది. ఇలా చాలా మందే ఉన్నారు.