Home » క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్.. ఏషియన్ గేమ్స్ లో భారత మహిళల, పురుషుల జట్లు.. ట్విస్ట్ ఏంటంటే..? 

క్రికెట్ హిస్టరీలో ఇదే ఫస్ట్.. ఏషియన్ గేమ్స్ లో భారత మహిళల, పురుషుల జట్లు.. ట్విస్ట్ ఏంటంటే..? 

by Anji
Ad

భారత్ వేదికగా ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ కోసం టీమిండియాను బలోపేతం చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఇప్పుడు వరల్డ్ కప్ తో పాటు అదే సమయంలో ప్రారంభం కానున్న ఆసియా క్రీడలకు కూడా పురుషుల, మహిళల జట్లను పంపించేందుకు బీసీసీఐ అంగీకరించింది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న ఆసియా క్రీడలకు పూర్తిస్థాయి మహిళల జట్టును పంపించాలని బీసీసీఐ భావిస్తోంది. పురుషుల జట్టులో స్వల్ప మార్పులు చేసింది. అది ఏంటంటే.. సీనియర్ జట్టుకు బదులుగా టీమిండియా బీ ఆసియా క్రీడల్లో పోటీ పడనుంది. 

Advertisement

ఆసియా క్రీడల్లో క్రికెట్ టీ 20 ఫార్మాట్ లో జరుగుతుంది. ఈ మేరకు బీసీసీఐ జూన్ 30లోపు తమ ఆటగాళ్ల జాబితాను భారత ఒలంపిక్ సంస్థకు సమర్పించనుంది. ప్రపంచ కప్ షెడ్యూల్ నేపథ్యంలో ఆసియా క్రీడలకు టీమిండియా పంపించేందుకు గతంలో బీసీసీఐ అంగీకరించలేదు. ఎందుకు అంటే 2023 ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్ జౌలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 08 వరకు జరుగనున్నాయి. వన్డే ప్రపంచ కప్ కూడా అదే సమయంలో అనగా అక్టోబర్ 05 నుంచి ప్రారంభం కానుంది. బిజీ షెడ్యూల్ కుదరదని నేపథ్యంలో భారత పురుషుల సీనియర్ జట్టు ఆసియా క్రీడల్లో పాల్గొనలేకపోతుంది. 

Advertisement

ఈ తరుణంలో బీసీసీఐ ఆసియా క్రీడలకు పురుషుల బీ జట్టును పంపుతుంది. చాలామంది సీనియర్ స్టార్ ప్లేయర్లు భారత ప్రపంచ కప్ జట్టులో భాగం కానున్నారు. భారత క్రికెట్ లో 2 నుంచి 3 జట్లను నిర్మించేంత మంది క్రికెట్ ప్రతిభ ఉన్న సంగతి తెలిసిందే. ప్రతిభవంతులైన ఆటగాళ్లను ఆసియా క్రీడలకు పంపాలని బీసీసీఐ ఆలోచించినట్టు సమాచారం. ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు పాల్గొనడం ఇది మొదటిసారి కావడం గమనార్హం. జులై, ఆగస్టులలో బర్మింగ్ హోమ్ లో జరిగిన 2022 కామన్వెల్త్ గేమ్స్ లో మహిళల క్రికెట్ జట్టు కనిపించి ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి సిల్వర్ మెడల్ తో సరిపెట్టుకుంది. ఆసియా క్రీడల్లో మొదటిసారిగా 2010లో క్రికెట్ ను చేర్చారు. 2014 ఎడిషన్ వరకు క్రికెట్ ఆసియా క్రీడల్లో భాగంగా ఉంది. జకర్తాలో జరిగిన 2018 ఎడిషన్ లో క్రికెట్ ని తొలగించారు. ఆ తరువాత క్రికెట్ ను 2022 గేమ్స్ లో చేర్చారు. కరోనా నేపథ్యంలో ఆటలు వాయిదా పడ్డాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

వెస్టిండీస్ టూర్ కు టీమిండియా టెస్టు, వన్డే జట్ల ఎంపిక.. రహానేకు కీలక బాధ్యతలు

Ms Dhoni : బస్సు డ్రైవర్ గా మారిన ధోనీ సహచరుడు

Visitors Are Also Reading