సాధారణంగా మనం ఎక్కువగా అన్నాన్ని ప్రధాన ఆహారంగా తీసుకుంటాం. అన్నం తిన్న వెంటనే కొద్దీ సేపు విశ్రాంతి తీసుకుని, ఆపై కాసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిదని, తిన్నది ఒంటబట్టి తిరుగుతుందని చెబుతుంటారు. అయితే, అన్నం తిన్న తరువాత చెయ్యకూడని పొరపాట్లు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి. అన్నం తిన్న తరువాత ఈ పొరపాట్లు చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ పాడవుతుంది వైద్యులు చెబుతున్నారు.
Advertisement
ఇంతకీ ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం. అన్నం తిన్నాక ఎక్కువ గ్యాప్ లేకుండా వెంటనే టీ లేదా కాఫీ లను తాగవద్దు. మరికొంత మంది స్వీట్ తినడాన్ని ఇష్టపడతారు. మరికొందరు గట్టిగా నిద్ర పోవడానికి ఇష్టపడతారు. ఇది చాలా తప్పు. తిన్నవెంటనే పడుకునే అలవాటు వల్ల పొట్టలో రసాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా గుండెల్లో మంట, అజీర్తి వంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తిన్న తరువాత పడుకోవడానికి కనీసం రెండు గంటల గ్యాప్ ఇవ్వాలి.
Advertisement
పడుకోవడానికి రెండు గంటల ముందే డిన్నర్ ను పూర్తి చేసుకోవాలి. కొందరు ఏకంగా తిన్న వెంటనే స్నానం చేస్తుంటారు. ఇది కూడా చాలా తప్పు. ఇలా చేస్తే, శరీర ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. దీనివల్ల ఆహరం జీర్ణం అవడానికి మరింత ఎక్కువ సమయం పడుతుంది. భోజనం చేసాక అధిక మొత్తంలో నీటిని తాగడం కూడా మంచిది కాదు. తినడానికి గంట ముందు, తిన్నాక గంట తరువాత నీరు త్రాగాలి. అలాగే తిన్న వెంటనే ఎక్సర్సైజ్ లాంటివి చేయకండి.
మరిన్ని ముఖ్య వార్తలు:
ఆదివారం రోజు మాంసం తింటే ఏమవుతుందో తెలుసా ?
తినేముందు విస్తారాకు చుట్టూ నీళ్లు చల్లుతారు.. ఎందుకో తెలుసా ?
అన్నంతో కలిపి ఈ పదార్థాలు తింటున్నారా.. అయితే ప్రమాదమే..!