పెళ్లంటే నూరేళ్ళ పంట. ఒకసారి వివాహబంధం లోకి అడుగు పెట్టిన తరువాత అంతా సక్రమంగా సాగాలని కోరుకుంటూ ఉంటాం. అయితే.. అలా సాగడానికి మనం అనువైన పార్టనర్ ను ఎంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రెండు మనసులు, ఇద్దరు మనుషులు ఒక్కటవ్వటం మాత్రమే కాదు రెండు కుటుంబాల బాధ్యతని కూడా మోయడం. రెండు కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తూ, కడదాకా ఒకరికొకరు తోడునీడగా నిలవడం. ప్రస్తుతం ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా, ఆ వివాహ బంధాలు ఎక్కువకాలం నిలవడం లేదు.
Advertisement
అలా జరగకుండా ఉండాలంటే, పెళ్ళికి ముందే అన్ని విషయాలను క్లియర్ గా మాట్లాడుకోవాలి. మీ పార్ట్ నర్ గురించిన విషయాలను తెలుసుకుని, అందుకు సిద్ధంగా ఉండాలి. కమ్యూనికేషన్ గురించి కూడా పెళ్ళికి ముందే మాట్లాడుకోవాలి. ఒకరి కమ్యూనికేషన్ విధానాలను మరొకరికి చెప్పుకోవడం వలన చిన్న తగాదాలు వచ్చినా సర్దుమణిగిపోతాయి. ఎదుటివారి నమ్మకాలను కూడా తెలుసుకోవాలి. బంధం నిలబడాలంటే పునాది గట్టిగా ఉండాలని తెలుసుకోండి. అలాగే ఆర్ధిక స్థితిగతుల గురించి, పొదుపు చేయడం లేదా డబ్బులు ఖర్చు చేసే అలవాట్ల గురించి కూడా చెప్పుకోవాలి.
Advertisement
భవిష్యత్ లో కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ముందే చెప్పుకోవాలి. కెరీర్ కి సంబంధించి మీ భవిష్యత్ లక్ష్యాల గురించి ముందే చెప్పాలి. దానికి తగ్గట్లు మీ ప్లానింగ్ ఎలా ఉంటుందో కూడా ముందే చెప్పాలి. పెళ్ళికి ముందు మీకేమైనా లవ్ లేదా బ్రేకప్ లాంటివి ఉంటె వాటి గురించి ముందు చెప్పడమే మంచిది. ఖాళీ సమయాల్లో ఏమి చేస్తుంటారు వ్యాపకాలు, హాబీల గురించి కూడా ముందే చెప్పాలి. అలాగే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటె వాటి గురించి కూడా చెప్పాలి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
మీ భార్య గొడవ పడితే ఇలా కూల్ చేయండి !
ఆదిపురుష్ మూవీలో సీత రాముడు కాకుండా.. రాఘవుడు జానకి ఎందుకు పెట్టారో తెలుసా ?
పెళ్లి చేసుకొని విడిపోయి చాలా కాలం ఒంటరిగా ఉన్న 8 నటులు..!!