దర్శకుడిగా ఆర్జీవీ, సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ ఇద్దరూ ట్రెండ్ సెట్ఠర్లే. వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే, అది చాలా క్రేజీ గా ఉంటుంది కదా. ఓ రేంజ్ లో సినిమా ఉంటుంది. కానీ, వీరిద్దరి మధ్య రియాలిటీలో అంత పొంతన లేదు. ఎందుకంటే వర్మ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా పవన్ అంటే తనకు ఇష్టం అని చెప్పే రామ్ గోపాల్ వర్మ ఆయనపై విమర్శలు చేయడం మాత్రం మానరు.
Advertisement
గతంలో రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనుకున్నారని మీకు తెలుసా? ఆయన పవన్ కళ్యాణ్ కు స్టోరీని కూడా వినిపించారట. పవన్ అసలు ఇండస్ట్రీకి రాని సమయంలోనే ఆర్జీవీ సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. మూస ధోరణిలో వెళ్తున్న ఇండస్ట్రీకి కొత్త మూవీ ఫార్మాట్ ను చూపించిన డైరెక్టర్ గా వర్మకి పేరుంది. ఆ సమయంలోనే ఓ సారి మెగాస్టార్ ఇంటికి వెళ్లారట.
Advertisement
అప్పటికి పవన్ కూడా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి, వస్తూనే ఏడు వరుస హిట్ లు అందుకని ఫుల్ ఫామ్ లో ఉన్నారు. చిరుతో మాటల్లో పవన్ గురించి రావడంతో, ప్రస్తుతం “వైఫ్ అఫ్ వర ప్రసాద్” సినిమాకు నిర్మాతగా ఉన్నానని, ఆ సినిమాకి పవన్ హీరోగా చేస్తాడేమోనని అడిగారట. కానీ అలాంటి పాత్రలు చేయనని పవన్ చెప్పడంతో అది ఎక్కడిదో ఆగిపోయింది. పవన్ కూడా డిఫరెంట్ అట్టిట్యూడ్ తో ఉంటారు. అప్పటికే ఇద్దరు సక్సెస్ తో దూసుకెళ్తూ ఉన్నారు. ఆ సమయంలో వీరిద్దరూ కలిసి ఓ మంచి సినిమా ప్లాన్ చేసుకుని ఉండుంటే కచ్చితంగా ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యుండేదేమో.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
విజయ్ దేవరకొండ ‘ఖుషి’ ఓటీటీ ఫార్ట్ నర్ లాక్.. అన్ని కోట్లకు అమెజాన్ సొంతం చేసుకుందా ?
రవితేజ అంత చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా? పెళ్లి నాటికి ఆమె వయస్సు ఎంతంటే.. ?