తెలుగు ఇండస్ట్రీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన గురించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా.. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా గురించి ఓ క్రేజీ విషయం వైరల్ అవుతోంది.
Advertisement
ఓవైపు రాజకీయాలు మరో వైపు సినిమాలతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊపిరి సలపనంత బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల తనకి ఉన్న అభిరుచిని వదులుకోలేరట. కుదిరినప్పుడల్లా సినిమాలు చూస్తూనే ఉంటారట. ఎక్కువగా చరణ్, ఎన్టీఆర్, చిరు, ప్రభాస్ సినిమాలను చూస్తూ ఉంటారట. గతంలో కూడా పవన్ ఎన్టీఆర్, ప్రభాస్ సినిమాలను ఎక్కువగా చూస్తానని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి వారు ఆయనకీ ఇష్టం అని అర్ధం అవుతోంది.
Advertisement
ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరో వైపు పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా కు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇష్టమట. వైవిధ్యంగా ఉండే ఆయన సినిమాలను ఎక్కువగా చూస్తారట. అంతే కాదు అన్నా లెజినోవాకు సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ మంచి స్నేహితురాలట. ప్రతి సారీ క్రిస్తమస్ కు నమ్రతకు అన్నా లెజినోవా బహుమతులు పంపిస్తుంటారట. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
మరిన్ని ముఖ్య వార్తలు:
నెలకు రూ.700 జీతం కోసం సూర్య అలాంటి పనులు చేసేవాడా..? సినిమాల్లోకి ఎలా వచ్చాడంటే…?
ఆ హీరోయిన్లకు భర్తగా నటించిన హీరోలే అన్నగా నటించిన సినిమాలు ఇవే..!
తమిళ స్టార్ హీరోలకు షాక్.. రెడ్ కార్డు ఇచ్చేందుకు నిర్మాతల మండలి సిద్ధం..!