Home » ఆదిపురుష్ మూవీకి ఎదురుదెబ్బ.. టికెట్స్ క్యాన్సిల్

ఆదిపురుష్ మూవీకి ఎదురుదెబ్బ.. టికెట్స్ క్యాన్సిల్

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, హీరోయిన్ కృతిసనన్ జంటగా నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. ఈ మూవీ  ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న విడుదలైంది. అయితే ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ మూవీ  టాక్ ఎలా ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఏ సినిమా కూడా వసూలు చేయనివిధంగా ఈ సినిమా ఫస్ట్ డే రూ.140కోట్లు, సెకండ్ డే రూ.100 కోట్లు భారీ వసూళ్లను సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 

adipuruh-movie-review-in-telugu

Advertisement

ఓవైపు నెగటివ్ రివ్యూలను తొలగిస్తే మనీ ఇస్తున్నారని టాక్ వినిపించగా.. మరోవైపు ఆదిపురుష్ టికెట్ బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ఇలా రకరకాలుగా ఈ సినిమా గురించి ఏదో ఒకటి సోషల్ మీడియాటో ట్రెండింగ్ కొనసాగుతోంది. మరోవైపు రామాయణాన్ని తప్పుగా చూపించారని.. హిందువుల మనోభావాలను దెబ్బతినేవిధంగా సినిమాలో పాత్రలను తీర్చిదిద్దారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సినిమాకి ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేయడంతో ఫస్ట్ షో, ఫస్ట్ డే చూడాలని చాలా మంది ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నారు. అందరూ చూడదగిన సినిమా కావడంతో మరికొంత మంది ఫ్యామిలీతో వెళ్లి చూసేవిధంగా ప్లాన్ చేసుకున్నారు. ఈ సినిమాకు వస్తున్న ట్రోల్స్, టాక్ ని చూసి కొంత మంది ఈ సినిమాని చూడకూడదని భావిస్తున్నారట. తాము బుక్ చేసుకున్న టికెట్స్ ని కూడా క్యాన్సిల్ చేసుకున్నారట. సోషల్ మీడియాలో కొంత మంది ఈ విషయం గురించి షేర్ చేస్తున్నారు.

Advertisement

అసలు తప్పుగా చిత్రీకరించిన రామాయణాన్ని చూడాలనుకోవడం లేదు. ఆదిపురుష్ మూవీ టికెట్స్ ని క్యాన్సిల్ చేశాను అని ఓ యూజర్ తెలిపడం గమనార్హం. మరో నెటిజన్ స్పందిస్తూ.. “నేను మా కూతురికి రామయణాన్ని తప్పుగా చూపించాలనుకోవడం లేదు. ఆదిపురుష్ మూవీ టికెట్స్ ని అందుకే క్యాన్సిల్ చేశాను” అంటూ మరొకరు రాసుకొచ్చారు. భారత ఇతిహాసం అయినటువంటి రామయణాన్ని అపహాస్యం చేశారు. ఆదిపురుష్ రామాయణం కాదని.. మరొకరు ఆరోపిస్తూ పోస్ట్ లో పేర్కొన్నారు. మరోవైపు ఆదిపురుష్ రైటర్ కూడా రామాయణం కాదని పేర్కొనడం గమనార్హం. వాస్తవానికి ఆదిపురుష్  టీజర్ విడుదలైనప్పుడే ఈ సినిమా పై నెగటివ్ విమర్శలను ఎదుర్కొంది. ఆ తరువాత 3D లో చూస్తే బాగుందని టాక్ వచ్చింది. ఇక అక్కడి నుంచి ఈ మూవీపై నెగటివ్ ప్రచారం జరిగినప్పటకిీ..  విడుదలకు రెండు, మూడు రోజుల ముందు పాజిటివ్ టాక్ రావడంతో చాలా మంది ఆసక్తి చూపించారు. ఇక విడుదలైన తరువాత నెగటివ్   టాక్  రావడంతో ఫస్ట్ డే కలెక్షన్ల కంటే రెండో రోజు  కలెక్షన్లు దాదాపు రూ.40 కోట్లు  తగ్గాయి. ముందు ముందు కలెక్షన్లు ఎలా ఉంటాయో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆదిపురుష్ మూవీ పై నెగిటివ్ పోస్ట్ లు తొలగిస్తే డబ్బులిస్తున్నారా ?

 ఏంటి.. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు డాన్స్ స్టెప్స్ ని ఆ స్టార్ హీరో సినిమా నుంచి కాపీ కొట్టేశారా…!

హీరో కాకముందు శోభన్ బాబుని అవమానించిన వ్యక్తి.. ఆ తరువాత అతను ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

 

Visitors Are Also Reading