మహిళ అందాన్ని పెంచే వాటిలో జుట్టు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ నేటి పరిస్థితులలో పొడవాటి నల్లన్ని జుట్టు ఉన్నవారు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. జీవనశైలిలో మార్పులు, వాతావరణంలో కాలుష్యం వల్ల జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవడం అనేది కష్టతరమైన ప్రయత్నంగా మారింది. ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా జుట్టు పొడి బారిపోవడం, తెల్ల జుట్టు రావడం లాంటి సమస్యలు యువతను చిన్నవయసులోనే అతిగా ఇబ్బంది పెడుతున్నాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు ఆహారంలో కొద్దిపాటి మార్పులను తీసుకోవడం వల్ల మంచి ఫలితం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు
Advertisement
ఏ ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా దృఢంగా పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ..
#1 ఉసిరికాయ :
Advertisement
ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసరికాయను అనేక జుట్టు సమస్యలను తొలగించడంలో ఎంతగానో సహాయపడుతుంది. దీనిలోని పోషకాలు చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ప్రతి రోజు ఉసిరితో తయారు చేసిన రసాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల జుట్టు పొడవగా తయారవుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ పాటు, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
#2. అవిసె గింజలు :
అవిసె గింజలలో ఔషద గుణాలతో పాటు యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి,, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషక గుణాలు పుష్కలంగా ఉన్నాయి. అవిసె గింజలు క్రమం తప్పకుండా ఆహారంగా తీసుకోవడం వలన జుట్టును నల్లగా దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది.
#3 కరివేపాకు :
కరివేపాకు కేవలం వంటల రుచిని ఇవ్వటమే కాదు ఆరోగ్యానికి మేలు చేసి జుట్టుకు పోషణ అందించడంలో కూడా సహాయపడుతుంది. జుట్టుకు కరివేపాకులను ప్రతిరోజు ఆహార పదార్థాలలో ఉపయోగించడం వల్ల జుట్టు పెరగడమే కాకుండా జుట్టు ఒత్తుగా, మెరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా కరివేపాకుని పేస్ట్ లా చేసి తలకు పట్టించడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుంది