ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ లు చాలా కామన్ అయిపోయాయి. భూమిపై ఉన్న ప్రతి ఒక్క మానవుడు మొబైల్ ఫోన్స్ ను వాడుతున్నారు. అప్పట్లో కేవలం కొంతమందికి మాత్రమే ఈ మొబైల్స్ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం బుడ్డోడు నుంచి ముసలోడి వరకు అందరికీ మొబైల్ ఫోన్స్ వచ్చేసాయి. గతంలో కేవలం ల్యాండ్ లైన్ ఫో న్లు ఎక్కువగా ఉండేటివి. అందులో బిఎస్ఎన్ఎల్ ఫోన్స్ మాత్రమే అవైలబుల్ లో ఉండేటివి.
Advertisement
కానీ గత పది సంవత్సరాలుగా వీటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని చెప్పుకోవాలి. దీనికి కారణం జియో నెట్వర్క్. ఎప్పుడైతే జియో నెట్వర్క్ మార్కెట్లోకి వచ్చిందో… అప్పటినుంచి… ఇంటర్నెట్ వాడకం భారీగా పెరిగిపోయింది. అలాగే ఫ్రీ అనే ఆప్షన్ ఉండటంతో ఎక్కువమంది జియో వాడటానికి ప్రిఫ రెన్స్ ఇచ్చారు. తద్వారా మొబైల్ ఫోన్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముసలి ముడత అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ… మొబైల్ ఫోన్స్ వాడటం కామన్ అయిపోయింది. ఇది అంతా పక్కకు పెడితే… ప్రతి మొబైల్ కు అనేక ఫీచర్స్ ఉంటాయన్న సంగతి తెలిసిందే.
Advertisement
అయితే స్మార్ట్ ఫోన్స్ లో ఒక చిన్న రంధ్రం ఉంటుంది. అది మీకు పైన ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది. అసలు దాని ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రంధ్ర నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్. ఇది మనం ఫోన్ మాట్లాడేటప్పుడు ఉపయోగపడుతుంది. మీరు ఫోన్ కాల్ లో ఉన్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ఉంటే… ఆ డిస్టబెన్స్ లేకుండా చేస్తుంది. అంటే మనం ఒకరితో మాట్లాడుతూ ఉంటే… మన దగ్గర ఉన్న డిస్టబెన్స్ వారికి వినిపించకుండా, కేవలం మన వాయిస్ స్పష్టంగా వారికి వినిపించేలా సహాయపడుతుంది ఈ రంధ్రం. ఒకవేళ ఈ రంద్రం లేకపోతే… మనం ట్రాఫిక్ లో ఉన్నప్పుడు అసలు మనం ఏం మాట్లాడినా అవతలి వ్యక్తికి ఏది అర్థం కాదు. అందుకే మొబైల్ ఫోన్స్ లో దీనిని ఫిక్స్ చేస్తారు.