Home » ఈ రాశులకి చెందిన మహిళలకు ఎలాంటి పురుషులు నచ్చుతారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

ఈ రాశులకి చెందిన మహిళలకు ఎలాంటి పురుషులు నచ్చుతారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

సాధారణంగా  ప్రేమ అనేది ఎవ్వరికీ  ఎప్పుడు పుడుతుందో అస్సలు అంచనా వేయలేము.  కొందరినీ చూసినప్పుడు ఈ జంట భలే ఉందే అనిపిస్తుంది. మరికొందరినీ చూస్తే.. ప్రేమ గుడ్డిదా అనే భావన కలుగుతుంది. ఎందుకు అంటే.. చాలా మంది ఈ మధ్యకాలంలో వయస్సు తారతమ్యం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. చాలా మంది స్త్రీలు తమకంటే వయస్సులో చిన్న వారిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వారు ఉన్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రాశులకు చెందిన మహిళలు తమకంటే వయస్సులో చిన్నవారైన పురుషులు అంటే విపరీతమైన ఇష్టమట. ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

మేషం :

ఈ రాశికి చెందిన మహిళలు ఎక్కువగా యువకులను ఇష్టపడుతారు. యువకుల పట్ల ఆకర్షణ ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి మహిళలకు యువకుల అభిరుచి ఆనందాన్ని ఇస్తుంది. 

వృషభం :

ఈ రాశికి చెందిన స్త్రీలు చాలా అందంగా ఉంటారు. వృషభ రాశికి చెందిన వారికి వయస్సులో తమ కంటే చిన్న వారి పట్ల మోజు చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందు ఉంటారు. కానీ తమ భాగస్వామి వయస్సులో చిన్నవారైతే బాగుండు అని కోరకుంటారు.

మిధున రాశి :

Advertisement

మిథున రాశికి చెందిన స్త్రీలు సమానమైన వ్యక్తుల కోసం చూస్తారు. ఈ రాశి వారు చాలా ఆహ్లాదకరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారి వయస్సు కంటే తక్కువ మానసిక స్థితిని కలిగి ఉంటారు. వారు తమ వ్యక్తిత్వం బలాలకు సరిపోయే వ్యక్తి జీవితంలోకి రావాలని కోరుకుంటారు. తమ కన్నా చిన్నవారు అయినా పర్వాలేదనుకుంటారు. 

కర్కాటక రాశి :

యువకులతో డేటింగ్ చేయడానికి ఈ రాశికి చెందిన మహిళలు చాలా ఆసక్తి చూపిస్తారట. వారు తమ భాగస్వామి పట్ల చాలా ఎక్కువగా శ్రద్ద పెడుతారు. వారు ఇష్టపడిన వారిని చాలా ప్రేమిస్తారు. మరోకారణం ఏంటంటే.. ఈ రాశికి చెందిన స్త్రీలు తమ తప్పులను దాచాలని చూస్తారు. వేరే వారితో పెళ్లి జరిగినా.. తమకంటే చిన్నవారితో ఎఫైర్ పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. 

వృశ్చికరాశి :

ఈ రాశి వారు ఎక్కువగా అయస్కాంత వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ఎవరినైనా వీరు ఇట్టే ఆకర్షిస్తారు. ఇతరులతో చాలా త్వరగా కనెక్ట్ అవుతారు. ఈ లక్షణాల కారణంగానే చాలా తొందరగా వీరు యువకులను ఆకర్షిస్తారు. జీవితంలో వీరు మసాలా ఎక్కువగా కోరుకుంటారు. దాని కోసం యువకులు అయితే బాగుండని కోరుకుంటారు. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఖర్చులు అధికం

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఆ రాశుల వారు ఖర్చులు నియంత్రించుకోకుంటే నష్టాలు తప్పవు

Visitors Are Also Reading