Adipurush Review and rating in Telugu: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా ఆదిపురుష్. ఇప్పుడు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఆదిపురుష్ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ చాలా గ్రాండ్ గా తీసారని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ ఆదిపురుష్ సినిమాలో… సీతమ్మ పాత్రలో కృతి సనన్ నటించగా రామయ్య పాత్రలో ప్రభాస్ అలరించనున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది. మరి రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
నటీనటులు : ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త, సోనాల్ చౌహన్, తృప్తి తోరదమల్ తదితరులు.
దర్శకుడు : ఓం రౌత్
నిర్మాత : భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్
సంగీతం : సంచిత బల్హారా, అంకిత్ బల్హారా
పాటలు : అజయ్-అతుల్, సాఛేత్ పరంపర
నిడివి : 179 నిముషాలు
కథ మరియు వివరణ
దశరథ మహారాజు వృద్ధాప్యం రావడంతో… తన పెద్ద కొడుకు రాఘవ్ (ప్రభాస్ ) కు అయోధ్య నగర మహారాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అయితే దానికి రాఘవ సవతి తల్లి కైకేయి ఒప్పుకోదు. తన కుమారుడు భరతునికి పట్టాభిషేకం చేయాలని… అంతేకాదు రాఘవ 14 సంవత్సరాలు వనవాసం చేయాలని పట్టుబడుతుంది కైకేయి. దీంతో రాఘవ వనవాసానికి వెళ్తాడు. రాఘవ తో పాటు ఆయన సతీమణి జానకి ( కృతి సనన్) తో కలిసి వనవాసానికి వెళతాడు.
Advertisement
అయితే అక్కడ కొన్ని గడిపిన తర్వాత… రావణాసురుడి చెల్లెలు… సూర్పనఖ రాఘవ తమ్ముడు లక్ష్మణుడు పై మనసు పడుతుంది. అయితే సూర్పనఖ అంటే లక్ష్మణుడికి ఇష్టం లేకపోవడంతో… ఆమెపై కోపంతో ఆమె ముక్కు కోసేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న లంకేషుడు అంటే రావణాసురుడు… కోపంతో, మారువేషంలో వచ్చి సీతమ్మను ఎత్తుకెళ్తాడు. ఇక అక్కడి నుంచి సినిమా ప్రారంభమవుతుంది. రావణాసురుని రాఘవ ఎలా వధిస్తాడు? రాఘవకు హనుమంతుని సహాయం ఎలా లభిస్తుంది ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా విశ్లేషణకు వస్తే… ఈ సినిమాలో విజువల్స్ చాలా బాగున్నాయి. త్రీడీ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఆడియన్స్ కు ఈ సినిమా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాను ఎగబడి చూసే ఛాన్స్ ఉంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా గా ఉంది. సెకండాఫ్ చాలా సాగదీతగా ఉన్నట్లు అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్
ప్రభాస్
ఓం రౌత్ దర్శకత్వం
విజువల్స్
హనుమంతుడి పాత్ర
మైనస్ పాయింట్స్
సాగదీత
సెకండ్ ఆఫ్
రేటింగ్ : 3/5
మరిన్ని ముఖ్య వార్తలు:
చిరంజీవి కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన 7 క్రేజీ ప్రాజెక్ట్ లు ఇవే…!
మరో 20 ఏళ్లలో నక్షత్రాలు మనకు కనిపించవు.. కారణం ఏంటంటే ?
Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఖర్చులు అధికం