Home » ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడో నాకు బాగా తెలుసు అవసరం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాను : తేజ

ఉదయ్ కిరణ్ ఎందుకు చనిపోయాడో నాకు బాగా తెలుసు అవసరం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాను : తేజ

by Sravan Sunku
Ad

ఒకప్పుడు టాలీవుడ్ లో లవ్ మూవీస్ అంటే అందరికీ గుర్తుకు వచ్చే హీరో లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ మాత్రమే. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హోదా సంపాదించుకున్నారు. ఎంత స్పీడ్ గా ఇండస్ట్రీలో ఎదిగారో అంతే స్పీడ్ గా వారి జీవితం కూడా ముగిసింది.

udaykiran

Advertisement

అలాంటి ఉదయ్ కిరణ్ సూ^^డ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ తేజ. ఉదయ్ కిరణ్ సూ^^డ్ చేసుకోవడానికి అసలు కారణం ఏంటనేది చెప్పేశారు.. మరి ఆ వివరాలు చూద్దాం. ఉదయ్ కిరణ్ గురించి ఎవరు ఏం మాట్లాడినా ఎమోషనల్ అవుతూ ఉంటారు. చిత్రం సినిమాతో డైరెక్టర్ తేజ ఉదయ్ కిరణ్ ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దీని తర్వాత నువ్వు నేను సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు. మనసంతా నువ్వే లాంటి చిత్రంతో ఉదయ్ కిరణ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారారు.

Advertisement

దీని తర్వాత ఎదురైన పరాజయాలతో ఉదయ్ కిరణ్ కెరియర్ లో డౌన్ ఫాల్ మొదలైంది అని చెప్పవచ్చు. చివరికి 2014లో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆయన మరణం పై ఇప్పటికీ అనేక రూమర్స్ వస్తున్నాయి. కానీ అసలు కారణమనేది ఎవరికి తెలియదు. ఉదయ్ కిరణ్ గురించి డైరెక్టర్ తేజ కి బాగా తెలుసు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో తేజ మాట్లాడుతూ ఉదయ్ కిరణ్ ఆ^^త్య గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయ్ కిరణ్ ఎందుకు ఆ^^త్య చేసుకున్నాడో నాకు తెలుసు అని అన్నారు.

ఉదయ్ కిరణ్ సూ$$డ్ చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు నేను ఫోన్లో మాట్లాడాను. చాలా విషయాలు చెప్పారు. తను ఎలాంటి తప్పు చేయలేదని కాకపోతే ఉదయ్ కిరణ్ కి తప్పు చేసే అంత ధైర్యం లేదు అని తేజ అన్నారు. దీంతో మరోసారి ఉదయ్ కిరణ్ ఆత్మహత్య గురించి చర్చ మొదలైంది.

ప్రస్తుతం డైరెక్టర్ తేజ రానా దగ్గుబాటి సోదరుడు దగ్గుబాటి అభిరామ్ తో అహింస అనే చిత్రం తెరకెక్కిస్తున్నారు. అభిరామ్ కి ఇది డెబ్యూ మూవీ. రానాకు తేజ నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో విజయాన్ని అందించాడు. ప్రస్తుతం అతని సోదరికి కూడా విజయాన్ని అందించే పనిలో పడ్డారు డైరెక్టర్ తేజ.

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ చదవండి !

Visitors Are Also Reading