ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా బుల్లి బాయ్ యాప్ పేరే వినిపిస్తోంది. అసలు ఈ యాప్ ఎక్కడిది…? కేసులో వినిపిస్తున్న కీలక వ్యక్తి శ్వేత ఎవరు అన్నదానిపై చాలా మంది ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో ఉండే ఒక వర్గం వారిని టార్గెట్ చేసుకుని అశ్లీల పోస్టులు అభ్యంతరకర పోస్టులు చేస్తూ వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి అప్లోడ్ చేస్తున్న యాపే బుల్లి బాయ్ యాప్. ఈ యాప్ పై మొదట ఓ యువతి ఫిర్యాదు చేయగా పోలీసులు తీగలాగితే డొంకంతా కదిలింది. ఈ కేసులో మొదట ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విచారణలో భాగంగా ఈ కేసులో కీలక సూత్రధారి 18ఏళ్ల శ్వేతా సింగ్ అని ముంబై పోలీసులు నిర్ధారించుకుని ఆమెను అరెస్ట్ చేశారు.
Advertisement
ప్రస్తుతం నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ వ్యవహారంలో ఇంకా ఎవరు ఉన్నారన్న దానిపై విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటపడ్డాయి. యాప్ సూత్రదారిగా చెబుతున్న శ్వేత సింగ్ కుటుంబ పరిస్థితులే ఈ చర్యలకు దారి తీశాయని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఓ వర్గానికి చెందిన యువతులను టార్గెట్ చేసిన శ్వేత ఆమె స్నేహితులు యువతుల ఫోటోలను మార్ఫింగ్ చేసి ఆన్లైన్ వేదికగా బుల్లి బాయ్ యాప్ లో వేలానికి వేశారు. వీళ్ళే గతంలో గిట్ హాబ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో సు* డీల్స్ పేరుతో ఒక అకౌంట్ ను నిర్వహించారు.
Advertisement
also read : సినిమా ఫంక్షన్ల స్టేజిలపై రాజకీయాలు మాట్లాడకూడదు…మా సినిమాకు ఇబ్బంది లేదు : నాగార్జున
ఆ తర్వాత బుల్లి బాయ్ యాప్ ను సృష్టించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇక శ్వేత సింగ్ 2020 -21 మధ్య తన తల్లిదండ్రులను కోల్పోయినట్టు తెలుస్తోంది. మొదటగా తల్లి క్యాన్సర్ తో మరణించగా ఆ తరవాత తండ్రి కరోనా తో మరణించారు. శ్వేతకు ఒక అక్క ఉండగా ఆమె డిగ్రీ చదువుతోంది. అంతే కాకుండా ఆమెకు ఒక తమ్ముడు చెల్లి ఉన్నారు. ప్రస్తుతం వారు స్కూల్ కి వెళ్తున్నారు. శ్వేత ఇంజనీరింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక శ్వేత యాప్ ను నిర్వహించేందుకు ఆమెకు నేపాల్ కు చెందిన ఓ స్నేహితురాలు సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది.