హీరో శ్రీకాంత్ కెరీర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలలో పెళ్లి సందడి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా 1990లో వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే మిస్ కాకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. ఇక ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ లుగా రవళి మరియు దీప్తి భట్నాకర్ నటించారు.
Advertisement
ఈ సినిమాతోనే దీప్తి తెలుగులో అడుగుపెట్టింది. అంతేకాకుండా మొదటి సినిమా అయినప్పటికీ దీప్తి తన నటనతో అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత దీప్తి వరుస ఆఫర్ లు దక్కించుకుంది. అయితే ఒకప్పుడు సినిమాల్లో నటించిన హీరోయిన్ లు చాలామంది ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక చాలాకాలంగా ఇండస్ట్రీకి దూరం అయిన దీప్తి ఇప్పుడు ఎలా ఉంది… ఏం చేస్తుంది అన్న వివరాలు ప్రేక్షకులకు తెలియదు.
Advertisement
వరుస సినిమాలు చేసిన దీప్తి 2002లో వచ్చిన కొండవీటి సింహాసనం సినిమా తర్వాత మళ్లీ టాలీవుడ్ స్క్రీన్ పై కనిపించలేదు. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు రణదీప్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం దీప్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత కూడా 2007లో రాఖీల్ పట్టు అనే మలయాళ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించింది. కేవలం నటించడమే కాకుండా దీప్తి నిర్మాతగా కూడా మారింది. దీప్తి భట్నాకర్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ సంస్థను స్థాపించింది.
ఆ సంస్థ ద్వారా అనేక టీవీ షోలకు నిర్మించింది. ఇక ఇప్పటికీ ఆ సంస్థ ద్వారా టీవీ షోలను నిర్మిస్తోంది. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ దీప్తి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇక పెళ్లి సందడి సినిమాలో ఎంతో అందంగా కనిపించిన దీప్తి ప్రస్తుతం చూడ్డానికి కాస్త బొద్దుగా మారిపోయింది. దాంతో గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.