Home » విజయ్ దేవరకొండ డబ్బులిచ్చి తిట్టించాడు…అనసూయ సంచలన వ్యాఖ్యలు..!

విజయ్ దేవరకొండ డబ్బులిచ్చి తిట్టించాడు…అనసూయ సంచలన వ్యాఖ్యలు..!

by AJAY
Ad

గత కొద్ది రోజులుగా యాంకర్ అనసూయ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ వేదికగా అనసూయ చాలాసార్లు విజయ్ దేవరకొండ ను టార్గెట్ చేసింది. పరోక్షంగా విజయ్ దేవరకొండ పై ట్వీట్లు చేసింది. దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఆంటీ అంటూ అనసూయను కామెంట్ చేశారు.

 

అంతేకాకుండా సోషల్ మీడియాలో అనసూయను ట్రోల్ చేసేవారు. ఇటీవల అనసూయ వరుస ట్వీట్లతో ఈ విషయంపై రెచ్చిపోయింది. అయితే తాజాగా అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో వివాదం పై స్పందించింది. విజయ్ దేవరకొండ డబ్బులు ఇచ్చి మరీ తనను తిట్టించాడని తెలిసి చాలా బాధపడ్డాను అని చెప్పింది. రీసెంట్ గా అనసూయ విమానం సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొంది.

Advertisement

Advertisement

ఈ సందర్భంగా మాట్లాడుతూ…. ఇకపై విజయ్ ఫ్యాన్స్ తో గొడవ పడొద్దు అని డిసైడ్ అయ్యాను. మానసిక ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. డబ్బులు ఇచ్చి మరీ నన్ను తిట్టించారనే విషయం తెలిసి చాలా బాధపడ్డానని తెలిపింది. అతనితో ఫోన్ కాల్ మాట్లాడటానికి ట్రై చేశానని… కానీ స్పందించలేదని చెప్పింది. నాకు ఎలాంటి పీఆర్ టీమ్ లేదని ఏదైనా నేనే మాట్లాడుతానని అనసూయ పేర్కొంది. ట్వీట్స్ కూడా నేనే చేస్తానని చెప్పింది. కానీ ఇకపై వివాదానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ అనసూయ క్లారిటీ ఇచ్చింది.

Visitors Are Also Reading