నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతిహాసన్ హనీ రోజ్ హీరోయిన్లుగా నటించిన సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించారు. అంతేకాకుండా ఈ సినిమాను నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు.
Advertisement
ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కూడా ముఖ్యమైన పాత్రలలో నటించారు. అంతేకాకుండా ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12 విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అదే విధంగా భారీ వసూళ్లను కూడా ఈ సినిమా రాబట్టింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా టీవీలో, ఓటీటీలో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.
Advertisement
అయితే థియేటర్ లో ఈ సినిమాలోని సీన్ లను ఎవరూ గమనించలేదు. కానీ ఓటీటీ లో మాత్రం ప్రేక్షకులు చాలా క్లియర్ గా గమనించారు. ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా నటించిన బాలయ్య డ్యూయల్ రోల్ చేయగా ఇద్దరూ కలుసుకున్న సమయంలో హనీ రోజ్ వాళ్ళని ఓ ఫోటో తీస్తుంది. అయితే అలా ఫోటో తీసే సమయంలో పక్కనే ఉన్న కమెడియన్ సప్తగిరి రెండు ఫోన్లు పట్టుకుని ఫ్లాష్ ఆన్ చేస్తాడు. అయితే హనీ రోజ్ ఫోటో తీసింది రాత్రి సమయంలో కాదు.. అంతే కాకుండా ఆ సమయంలో చీకటి కూడా ఉండదు.
పూర్తిగా వెలుతురు ఉంటుంది. అలాంటి సమయంలో సప్తగిరి ఫ్లాష్ ఎందుకు ఆన్ చేశాడు. అనే డౌట్ ప్రేక్షకుల వచ్చింది దాంతో ఈ సీన్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. డే టైం లోనూ ప్లాన్ ఫ్లాష్ ఆన్ చేస్తారా భయ్యా…? అంటూ దర్శకుడిని ట్రోల్ చేస్తున్నారు. అయితే మరి కొందరు మాత్రం సినిమాలో ఫోటో తీస్తున్నారు అని ప్రేక్షకులకు తెలియాలని అలా ఫ్లాష్ ఆన్ చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చదవండి !