Home » బాలయ్య నో చెప్పిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన మోహన్ బాబు …ఆ సినిమా ఏదంటే…?

బాలయ్య నో చెప్పిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన మోహన్ బాబు …ఆ సినిమా ఏదంటే…?

by AJAY

చిత్ర పరిశ్రమలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమా మరో హీరో చేతికి వెళ్లడం కామన్. అలా వెళ్లిన సినిమాలు కొన్నిసార్లు హిట్ అయితే మరికొన్ని సార్లుర్ ఫట్ అవుతాయి. హిట్ అయితే మిస్ చేసుకున్న హీరో బాధపడాల్సి వస్తుంది. ఒకవేళ ఫ్లాప్ అయితే మిస్ చేసుకున్న హీరో లక్కీ అనే చెప్పాలి. అయితే ఇండస్ట్రీలో బాలయ్య కూడా ఓ సూపర్ హిట్ సినిమాను రిజెక్ట్ చేసి బాధపడ్డారు. అయితే అదే కథలో నటించి మోహన్ బాబు సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు.

ఆ సినిమా ఏది అన్న వివరాలు ఇప్పుడు చూద్దాం…. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పై ఇప్పుడు ట్రోల్స్ వస్తున్నాయి కానీ ఒకప్పుడు ఆయన కూడా స్టార్ హీరోల జాబితాలో ఉన్నారు. మోహన్ బాబు కెరీర్ లో 500 లకు పైగా సినిమాల్లో నటించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా దర్శకుడిగా ఇలా సినిమాకు సంబంధించిన అన్ని క్రాఫ్ట్ లలో మోహన్ బాబు పని చేశారు. అయితే మోహన్ బాబు ఒకానొక సమయంలో ఫ్లాప్ లతో బాధపడ్డారు.

అదే సమయంలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావును ఒక సినిమా చేసి పెట్టాలని కోరారు. అంతకుముందు కూడా వరుస ఫ్లాప్ లతో ఉన్న రాఘవేంద్ర రావు చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత మోహన్ బాబు తో రాఘవేంద్రరావు సినిమా చేశారు. అది కూడా రీమేక్ సినిమా. అయితే ఆ సినిమా చేయవద్దని రాఘవేంద్రరావుకు చాలామంది చెప్పారు కానీ ఆయన వినలేదు. కసితో మోహన్ బాబు హీరోగా అల్లుడుగారు సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కానీ నిజానికి అల్లుడుగారు సినిమాను బాలకృష్ణ తో చేయాలని అనుకున్నారు. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాకు రీమేక్ గా అల్లుడుగారు సినిమాను తెరకెక్కించారు. మొదట ఈ సినిమా కథను బాలకృష్ణకు వినిపించినప్పటికీ కథ నచ్చకపోవడంతో ఆయన రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత రీమేక్ రైట్స్ చేతులు మారి మోహన్ బాబుకు వద్దకు వెళ్లాయి. అలా మోహన్ బాబు అల్లుడుగారు సినిమాలో నటించగా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ శోభన హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలోని సెంటిమెంట్ ప్రేక్షకులను టచ్ చేసింది.

Visitors Are Also Reading