దర్శకుడిగా ఇండియా వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రామ్ గోపాల్ వర్మ ఒకరు. వర్మ శివ లాంటి సినిమా తీసి ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ తర్వాత ఎన్నో బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించి అక్కడ కూడా సాలిడ్ విజయాలను అందుకుని ఇండియా వ్యాప్తంగా దర్శకుడిగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇలా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపను సంపాదించుకున్న ఆర్జీవీ గత కొన్ని సంవత్సరాలుగా అనేక సినిమాలకు దర్శకత్వం వహిస్తూ వస్తున్నప్పటికీ ఏ సినిమా కూడా కనీసం ప్రేక్షకులను అలరించలేక పోతుంది.
Advertisement
అయినప్పటికీ వర్మ ఏదో ఒక కాంట్రవర్షియల్ మూవీని రూపొందిస్తూ వార్తల్లో నిరుస్తూనే ఉంటున్నాడు. అలాగే ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై స్పందిస్తూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే ఆర్జీవీ తాజాగా ఒక సినిమాను మొదలు పెట్టాడు. ఈ సినిమా మొదలు కావడంతోనే ఈ దీనికి సంబంధించిన అనేక విషయాలు వార్తల్లో నిలుస్తున్నాయి.
Advertisement
తాజాగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే పేరుతో ఒక మూవీ ని మొదలు పెట్టాడు. తాజాగా ఈ ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా విడుదల చేశాడు. రామ్ గోపాల్ వర్మ విడుదల చేసిన ఫోటోలు ప్రస్తుతం సంచలనంగా మారాయి అందుకు ప్రధాన కారణం అందులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతి రెడ్డి పాత్రలకు సంబంధించిన ఫోటోలు ఉండటమే.
ఈ సినిమాలో జగన్ మోహన్ రెడ్డి పాత్రను అజ్మల్ పోషిస్తూ ఉండగా… భారతి పాత్రను మానస పోషిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలోనే ఇన్ని సంచలనాలను రేపుతుంటే విడుదల అయ్యాక ఎలాంటి కాంట్రవర్సీ లకు దారి తీస్తుందో చూడాలి. అంతే కాకుండా వర్మ ఏపీలో వైసీ పీ సపోర్టర్ అని టీ డీ పీ, జనసేన హేటర్ అని అందరికీ తెలుసు కాబట్టి వ్యూహం సినిమాలో జగన్ పాత్రను ఎలా చూపిస్తారు అనే ఆసక్తి ప్రేక్షులలో నెలకొంది.