మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనతో, టాలెంట్ తో, డాన్స్ తో ఎంతోమంది ప్రేక్షకులను కట్టిపడేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఇప్పటికీ కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. తాజాగా కూడా చిరంజీవి “వాల్టేరు వీరయ్య” అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
Advertisement
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోని జనాలు అంతా వెయ్యి కోట్ల కలెక్షన్లను సాధించిన సినిమాలను తెగ పొగడ్తల్లో ముంచేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటివరకు 1000 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించినటువంటి సౌత్ సినిమాలు అయినా బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ మూవీలపై ఎంతోమంది సినీ ప్రేమికులు… సినీ విశ్లేషకులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.
Advertisement
కానీ ఆ సమయంలోనే చిరంజీవి ఈ రేంజ్ కలెక్షన్లకు మించి వసూలను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాడు. చాలా సంవత్సరాల క్రితం చిరంజీవి “యముడికి మొగుడు” అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రాధ, విజయశాంతి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 1988వ సంవత్సరంలో విడుదల అయ్యి అప్పటివరకు ఏ తెలుగు సినిమా కూడా కలెక్ట్ చేయని కలెక్షన్లను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా సమయంలో టికెట్ ధర ఒక రూపాయల నుండి… నాలుగు రూపాయల వరకు మాత్రమే ఉండేది. ఆ సమయంలోనే ఈ సినిమా 4 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇప్పుడు ఉన్న టికెట్ ధరలను… అప్పుడు ఉన్న టికెట్ ధరలను పోల్చి చూసినట్లయితే ఈ సినిమా బాహుబలి సినిమాను మించిన కలెక్షన్లను ఆరోజే సాధించినట్లు అవుతుంది.