Home » శ్రీదేవి ఆ రెండు మూవీలను రిజెక్ట్ చేయకపోతే పాన్ వరల్డ్ స్టార్ అయ్యేది… ఆ మూవీలు ఏవో తెలుసా..?

శ్రీదేవి ఆ రెండు మూవీలను రిజెక్ట్ చేయకపోతే పాన్ వరల్డ్ స్టార్ అయ్యేది… ఆ మూవీలు ఏవో తెలుసా..?

by AJAY
Ad

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన శ్రీదేవి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాల నటిగా కెరియర్ను మొదలుపెట్టి ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్గా అవకాశాలను దక్కించుకొని ఒక్కో విజయాన్ని అందుకుంటూ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా ఎన్నో సంవత్సరాలు శ్రీదేవి కెరీర్ను కొనసాగించింది. ఇలా ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన ఈ ముద్దుగుమ్మ తన కెరియర్లో కొన్ని భారీ బ్లాక్ బాస్టర్ సినిమాలను కూడా వదులుకుంది.

Advertisement

అలా వదులుకున్న సినిమాలలో కొన్ని అద్భుతమైన విజయాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి. అలా శ్రీదేవి తన కెరీర్లో వదులుకున్న రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించుకున్నాయి. ఆ రెండు సినిమాలు కనుక ఈ నటి చేసి ఉంటే పాన్ వరల్డ్ లో అద్భుతమైన క్రేజీ ను సంపాదించుకోని ఉండేది. మరి ఈ నటి అంతటి విజయాలను సాధించిన ఆ సినిమాలను ఎందుకు వదులుకుంది… ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.

Advertisement

ఇండియాలో స్టార్ హీరోయిన్గా కెరీర్ను కొనసాగిస్తున్న సమయంలో శ్రీదేవికి హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్పిల్ బ‌ర్గ్ నుంచి అవ‌కాశం ద‌క్కింది. ఆయన ఈ నటిని తాను దర్శకత్వం వహించిన జురాసిక్ పార్క్ మూవీలో నటించడం కోసం సంప్రదించాడట. కానీ ఈనటి ఆ సమయంలో తేదీలు ఖాళీగా లేకపోవడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. అలా ఈ మూవీని రిజెక్ట్ చేయడం ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించడంతో ఈ సినిమాను వదులుకున్నందుకు శ్రీదేవి ఆ సమయంలో చాలా బాధపడిందట. ఇది ఇలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి మూవీ ఏ రేంజ్ విజయం అందుకుందో మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీలో ప్రభాస్ కు తల్లి పాత్రలో నటించిన రమ్యకృష్ణకు కూడా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఈ సినిమాలో మొదట రమ్యకృష్ణ పాత్రకు రాజమౌళి… శ్రీదేవిని సంప్రదించాడు. ఈ మూవీలో ప్రభాస్ తల్లి పాత్రలో నటించడానికి ఈనటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇందులో నటించడానికి శ్రీదేవి అనేక కండిషన్లను పెట్టడంతో ఈ మూవీ బృందం వెనక్కు తగ్గింది. అలా శ్రీదేవి “బాహుబలి” మూవీ ని కూడా మిస్ చేసుకుంది. ఈ రెండు మూవీలను కనుక చేసి ఉంటే శ్రీదేవి పాన్ వరల్డ్ నటిగా క్రేజ్ తెచ్చుకొని ఉండేది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

Visitors Are Also Reading