విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో భాషల సినిమాల్లో నటించి తన నటనతో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన ఎన్నో సినిమాల్లో తండ్రి , అన్న , విలన్ , హీరో ఇంకా మరెన్నో పాత్రల్లో కూడా నటించి తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.
Advertisement
ఇది ఇలా ఉంటే ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి “ఇద్దరు” మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. ప్రకాష్ రాజ్ ఎక్కువ శాతం తెలుగులో విలన్ పాత్రల్లో నటించాడు. అందులో భాగంగా ఈయన నటనతో ఎన్నో సినిమాలను విజయవంతం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ నటుడు టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఈయన మంచు విష్ణు పై పోటీ చేసి అపజయాన్ని అందుకున్నాడు.
Advertisement
ఇక ప్రకాష్ రాజ్ పర్సనల్ జీవితానికి వస్తే … ఆయన చాలా సంవత్సరాల క్రితమే తాను వివాహం చేసుకున్న మొదటి భార్యకు విడాకులు ఇచ్చి తనకు దూరంగా ఉంటున్నాడు. ప్రకాష్ రాజ్ మొదటి భార్యకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీరు విడిపోయినప్పటికీ ఫ్రెండ్ షిప్ రూపంలో అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటారు అని తెలుస్తుంది. అలాగే ఈ నటుడు కూడా తన పిల్లలతో సమయాన్ని గడుపుతూ ఉంటాడట.
ఇది ఇలా ఉంటే మొదటి భార్యతో విడిపోయిన ప్రకాష్ రాజ్ తన భార్యకు నెలకు 5 నుండి 6 లక్షల వరకు పంపిస్తాడట. ఇలా ప్రకాష్ తన భార్యతో విడిపోయినప్పటికీ తన పిల్లలను బాగా చూసుకోవడం కోసం… వారి అభివృద్ధి కోసం… అలాగే తన పిల్లలకు మరియు భార్యకు మంచి వసతులు కల్పించడం కోసం ఇలా భారీ మొత్తాన్ని ప్రతినెలా పంపిస్తాడట.