Home » 2 సుడులు ఉన్నవారు 2 పెళ్లిళ్లు చేసుకుంటారా..శాస్త్రం ఏమంటుందంటే..?

2 సుడులు ఉన్నవారు 2 పెళ్లిళ్లు చేసుకుంటారా..శాస్త్రం ఏమంటుందంటే..?

by Sravanthi
Ad

మన భారతదేశం అంటేనే జ్యోతిష్య శాస్త్రాలకు పుట్టినిల్లు. జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి అన్ని పనులు చేస్తుంటారు. ఆ విధంగా చాలామంది తలలో రెండు లేదా మూడు సుడులు ఉంటుంటాయి. తలపై ఎన్ని సుడులు ఉంటే అన్ని పెళ్లిళ్లు చేసుకుంటారని అందరూ అంటుంటారు. దీంతో పెద్ద వాళ్ళు సైతం ఒక్కోసారి ఆందోళనకు గురవుతారు. దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో చూద్దాం..

Advertisement

నిజానికి ప్రపంచ జనాభాలో ఐదు శాతం మందికి రెండు సుడులు ఉన్నట్లు ఎన్ హెచ్ జి ఆర్ ఐ అధ్యయనం వెల్లడించింది. శాస్త్రీయంగా చెప్పాలి అంటే డబల్ ట్విస్టేడ్ హెయిర్ ఏర్పడటంలో జన్యున్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. వారి తల్లిదండ్రులకు ఉన్న దాన్నిబట్టి పిల్లలకు కూడా ఏర్పడతాయి. కాబట్టి తలలో రెండు సుడులు అనేవి పురుషులు, మహిళలు వారి కుటుంబ సభ్యుల వారసత్వంగా పొందుతారని నిపుణులు అంటున్నారు.

Advertisement

సాధారణంగా చెప్పాలంటే ఇది సహజ లక్షణమే. దీన్ని చూసి చాలామంది రెండు సుడులు ఉన్నాయి కాబట్టి రెండు పెళ్లిళ్లు చేసుకుంటారని అంటుంటారు. దీనిపై కచ్చితమైన ఆధారం మాత్రం లేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే రెండు సుడులు ఉన్న వ్యక్తులు మంచివారు. సూటిగా మాట్లాడుతూ ఓపికగా ఉంటారు. కష్టాల్లో స్పందిస్తూ, ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే చాలా సార్లు ఆలోచిస్తారట. వారి చుట్టూ ఉన్న వారిని కూడా ఆనందంగా చూసుకుంటారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

మరికొన్ని ముఖ్య వార్తలు:

 

Visitors Are Also Reading