Home » “వార్ 2” మూవీలో ఎన్టీఆర్ పాత్రను ఆ కారణంతో రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో… ఆ కారణం ఏంటో తెలుసా..?

“వార్ 2” మూవీలో ఎన్టీఆర్ పాత్రను ఆ కారణంతో రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో… ఆ కారణం ఏంటో తెలుసా..?

by AJAY
Ad

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య స్పై యాక్షన్ ద్రిల్లర్ మూవీలు అనేకం వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా వస్తున్న స్పై యాక్షన్ ధ్రిల్లర్లలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సపరేట్ ఇమేజ్ను కలిగి ఉన్న సిరీస్ మూవీ “వార్”. ఈ మూవీ మొదటి భాగంలో హృతిక్ రోషన్ హీరోగా నటించగా… టైగర్ షర్ఫ్ విలన్ పాత్రలో నటించాడు. సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

Advertisement

ఇలా ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీకి సీక్వెల్ గా వార్ 2 అనే మూవీని తెరకెక్కించబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కాకపోతే ఈ సినిమాకు మొదటి భాగానికి దర్శకత్వం వహించినటువంటి సిద్ధార్థ్ ఆనంద్ కాకుండా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది.

Advertisement

వార్ 2 మూవీ యూనిట్ ఎన్టీఆర్ కంటే ముందు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నటువంటి ప్రభాస్ ను ఈ మూవీ లో ఎన్టీఆర్ పాత్ర కోసం అనుకుందట. కానీ ఒక కారణంతో ఈ సినిమాను ప్రభాస్ రిజెక్ట్ చేశాడట. ఆ కారణం ఏమిటో తెలుసుకుందాం. వార్ 2 మూవీలో హృతిక్ రోషన్ హీరోగా కనిపించనుండగా… ప్రభాస్ విలన్ పాత్రలో కనిపించబోయే కథను ఈ మూవీ బృందం ప్రభాస్ కి వినిపించిందట.

దానితో ప్రభాస్ విలన్ పాత్రలో నటించే ఇంట్రెస్ట్ లేదు అని సున్నితంగా చెప్పాడట. అయినప్పటికీ ఇందులో విలన్ ఎందుకు అలా కనిపిస్తాడు అనేదానికి స్ట్రాంగ్ రీజన్ ఉన్నప్పటికీ ప్రభాస్ కన్విన్స్ కాలేదట. అలా ప్రభాస్ కు ఈ మూవీలో విలన్ పాత్రలో నటించే ఉద్దేశం లేక రిజెక్ట్ చేయడంతో ఎన్టీఆర్ కు ఈ మూవీ బృందం కథను చెప్పి ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది.

Visitors Are Also Reading