సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడు రిజక్ట్ చేసిన కథతో మరో నటుడు సినిమా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధిస్తే మరికొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకుల పెద్దగా అలరించలేదు. ఇది ఇలా ఉంటే కొన్ని సందర్భాలలో ఒక హీరో కాకుండా ఇద్దరు ముగ్గురు హీరోలు రిజెక్ట్ చేసిన కథలను కూడా కొంతమంది హీరోలు సెలెక్ట్ చేసుకుని వాటిలో నటిస్తూ ఉంటారు.
Advertisement
అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్లో కూడా ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు రిజెక్ట్ చేసిన కథలో నటించి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంటున్నాడు. అది ఏ మూవీనో తెలుసా..? అదే చక్రం మూవీ. ప్రభాస్ హీరోగా రూపొందిన ఈ సినిమాలో ఆసిన్… ఛార్మి కౌర్ హీరోయిన్లుగా నటించగా… కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ప్రకాష్ రాజ్, ఊర్వశి, తనికెళ్ల భరణి ఈ మూవీలో ముఖ్యపాత్రలలో నటించారు.
Advertisement
పద్మాలయ టెలి ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. 2005వ సంవత్సరంలో మార్చి 25 తేదీన ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ క్యాన్సర్ వాడితో బాధపడుతూ చావుకు దగ్గరలో ఉన్న వ్యక్తి పాత్రలో నటించాడు. చావు దగ్గరలో ఉన్న కానీ ఆ బాధను బయట పెట్టకుండా నవ్వుతూ ఉండాలి… ఇతరులను నవ్విస్తూ ఉండాలి అనే పాత్రలో ఈ సినిమాలో నటించిన ప్రభాస్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కాకపోతే ఈ మూవీ చివరన ప్రభాస్ చనిపోయే పరిస్థితులు ఉండడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అంతగా తట్టుకోలేకపోయింది.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ కథను మొదట కృష్ణవంశీ… చిరంజీవికి వినిపించాడట. కాకపోతే సినిమా చివర్లో హీరో చనిపోతే సినిమా హిట్ అవ్వదు అనే నేపథ్యంతో ఈ సినిమాను సున్నితంగా చిరంజీవి రిజెక్ట్ చేశాడట. ఆ తర్వాత ఇదే కథను మహేష్ బాబుకు వినిపించగా… చిరంజీవి చెప్పిన కారణాన్నే మహేష్ కూడా చెప్పి ఈ మూవీ నుండి తప్పుకున్నాడట. చివరకు ప్రభాస్ కు ఈ మూవీ కథను వివరించగా ఈ హీరోకు ఈ మూవీ కథ అద్భుతంగా నచ్చడంతో ఈ మూవీలో నటించాడట.