అలనాటి కాలంలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ దర్శకుడుగా ఎన్నో సంవత్సరాల పాటు కొనసాగిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన తన కెరియర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీలకు కూడా దర్శకత్వం వహించాడు. మరి ముఖ్యంగా రాఘవేందర్రావు తన సినిమాల్లో హీరోయిన్లను అద్భుతంగా చూపిస్తూ ఉంటాడు. ఈయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలో హీరోయిన్గా నటించినట్లు అయితే దాదాపు వారు స్టార్ హీరోయిన్లుగా మారిపోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని… ఆ కాలంలో అనేకమంది కూడా మాట్లాడుకునేవారు.
Advertisement
అదే రేంజ్లో ఈ దర్శకుడు కూడా ఎంతో మంది కొత్త హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారిని స్టార్ హీరోయిన్లుగా కూడా మలిచాడు. ఇది ఇలా ఉంటే హీరోయిన్లను చాలా అందంగా చూపెట్టడం కోసం రాఘవేంద్రరావు వారిని చాలా కష్టపేడుతూ కూడా ఉంటాడట. కాకపోతే తన కెరీర్లో ఏ నటిని కూడా కష్టపెట్టని రీతిలో ఒక స్టార్ హీరోయిన్ కష్టపెట్టాడట. ఆ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా… ఆమె అలనాటి కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగినటువంటి నగ్మా.
Advertisement
ఈ ముద్దుగుమ్మ రాఘవేందర్రావు దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించింది. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా నగ్మా హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలోని ఒక సాంగ్ విషయంలో ఈ దర్శకుడు ఆమెను చాలా కష్టపెట్టాడట. కాకపోతే అదంతా సినిమా కోసం… సినిమా బాగా రాగవడం కోసం మాత్రమే.
అసలు ఏం జరిగింది అంటే … ఈ సినిమాలో “ఏందిబే ఎట్టాగా ఉంది ఒళ్ళు” అనే మాస్ సాంగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ సాంగ్లో నగ్మా లుంగి పైకి కట్టి అదిరిపోయే మాస్ స్టెప్పులు వేయవలసి ఉంటుంది. కాకపోతే ఇలా లుంగి పైకి ఎత్తి కట్టడం ఈ నటికి ఇష్టం లేదట. అయినా కూడా రాఘవేంద్రరావు ఫోర్స్ చేయడంతో అలాగే నటించిందట. అలాగే ఈ సాంగ్లో నగ్మా మందు తాగి చందులయ్యాల్సిన సన్నివేశాలు ఉంటాయి. ఇందులో నిజంగానే మందు తాగితే బాగుంటుంది అని సజేస్ చేశాడట. ఈ సాంగ్ కోసం ఈ సాంగ్ అద్భుతంగా రావడం కోసం ఇలా చేశాడట. చివరకు ఈ సాంగ్ ధియేటర్లలో ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది.