చిరంజీవి తన కెరియర్లో ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బాస్టర్… ఇండస్ట్రీ హిట్ మూవీలలో హీరోగా నటించాడు. అలాగే కొన్ని భారీ నష్టాలను మిగిల్చిన సినిమాలలో కూడా నటించాడు. అలా చిరంజీవి కెరీర్లో భారీ నష్టాలను మిగిల్చిన మూవీలు ఏవో తెలుసుకుందాం.
బిగ్ బాస్ : చిరంజీవి హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏమాత్రం అలరించలేకపోయింది. ఈ మూవీ చిరంజీవి కెరీర్లో భారీ నష్టాలను మిగిల్చింది.
Advertisement
శంకర్ దాదా జిందాబాద్ : చిరంజీవి హీరోగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా హిందీ సినిమా లగే రహో మున్నాభాయ్ సినిమాకు రీమిక్ గా రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ద్వారా నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి.
మృగరాజు : చిరంజీవి హీరోగా సిమ్రాన్ హీరోయిన్గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ద్వారా కూడా నిర్మాతలకు భారీ మొత్తంలో నష్టాలు వచ్చాయి.
Advertisement
అంజి : చిరంజీవి హీరోగా నమ్రత హీరోయిన్గా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక భారీ నష్టాలను అందుకుంది. ఈ మూవీని ప్రముఖ నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించాడు.
సైరా నరసింహారెడ్డి : మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ ఇదే. ఈ సినిమాలో నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటించగా … సురేందర్ రెడ్డి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లను రాబట్టినప్పటికీ ఈ మూవీకి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఈ మూవీకి 30 కోట్ల మేర నష్టం వచ్చినట్లు తెలుస్తుంది.
ఆచార్య : చిరంజీవి హీరోగా రూపొందిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా … రామ్ చరణ్ ఈ మూవీలో ఒక కీలక పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అందుకుంది. దానితో ఈ మూవీకి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలు వచ్చాయి.
ఈ మూవీలతో పాటు చిరంజీవి కెరీర్లో ఆరాధన, త్రినేత్రుడు, స్టువర్టుపురం పోలీస్ స్టేషన్, ఎస్పీ పరశురాం, జేబుదొంగ, కిరాతకుడు, చాణక్య శపథం, వేట, ధైర్యవంతుడు వంటి మూవీలకు కూడా భారీ నష్టాలు వచ్చాయి.