జీవితంలో పెళ్లి అనేది అత్యంత ముఖ్యమైన ఘట్టం. పెళ్లికి వచ్చిన అతిథులు పెళ్లి జంట ఎలా ఉంది ఈడు జోడు బాగుందా లేదా అనే చూస్తూ ఉంటారు. తమిళ సెలబ్రిటీ జంట రవీందర్ చంద్రశేఖర్, మహాలక్ష్మిల విషయంలోనూ అదే జరిగింది. వీరు 1, సెప్టెంబర్ 2022న వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు వచ్చినప్పటి నుంచి అనేక రకమైన ట్రోలింగ్ కు గురవుతూనే ఉన్నారు.
Advertisement
మహాలక్ష్మి యాంకర్ బుల్లితెర నటి. రవీందర్ చంద్రశేఖర్ తమిళ నిర్మాత. మహాలక్ష్మిని డబ్బు కోసమే వివాహం చేసుకున్నావ్ అంటూ అనేక రకాలుగా ట్రోలింగ్ చేశారు. వీరిద్దరి జంటపై నెట్టింట తరుచు ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. రవీందర్ ను లావుగా ఉన్నవ్ అంటూ బాడీ షేమింగ్ చేస్తూ… మహాలక్ష్మిని డబ్బు కోసమే చేసుకున్నావంటూ ట్రోలింగ్ చేశారు. ఆ ట్రోలర్స్ నోరు మూయిస్తూ మహాలక్ష్మి తరచూ తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది.
Advertisement
ఈ మధ్య కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వీరిద్దరి విడిపోయారంటూ ప్రచారం చేశారు. ఈ వార్తలకు చెక్ పెడుతూ మహాలక్ష్మి తాజాగా ఇన్స్టాగ్రామ్ లో తన భర్తతో కలిసి దిగిన ఓ రొమాంటిక్ ఫోటోని పోస్ట్ చేసింది. “నువ్వు నా భుజంపై చేయి వేసినప్పుడు ఈ ప్రపంచంలో నేను ఏదైనా చేయగలను అన్నంత ధైర్యం వస్తుంది… నా మనసు నిండా నువ్వే అమ్ము…ఐ లవ్ యు అని క్యాప్షన్ లో రాసుకొచ్చింది. దీనికి రవీందర్ కూడా ఐ లవ్ యు” అని రిప్లై ఇచ్చాడు. మీరిద్దరూ విడిపోయారని వార్త రాగానే చాలా భయపడిపోయాము. ఇప్పుడు సంతోషంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
Sudhakar : నేను ఇంకా చనిపోలేదు… బతికే ఉన్నాను
ఏపీ సీఎం జగన్ కుటుంబ ఆస్తి 500 కోట్లు..బాబు కంటే తక్కువేనట !
వంటలక్క బ్యాక్ గ్రౌండ్ ఎంటో తెలుసా..ఆమె పేరుపై వందల కోట్ల ఆస్తులు !