ఈ మధ్యకాలంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో అనేక సినిమాలు వస్తున్నాయి. ఒకవేళ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సినిమా మొత్తం లేకపోయినా ఏదో ఒక పాత్రకు అయిన తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటూ వచ్చిన సినిమాలు కూడా అనేకం ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాల్లో ఏ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయో తెలుసుకుందాం.
Advertisement
ఫిదా : వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
జాతి రత్నాలు : నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రవీంద్ర ప్రధాన పాత్రలలో రూపొందిన ఈ సినిమా కూడా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొంది మంచి విజయం అందుకుంది.
లవ్ స్టోరీ : నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలంగాణ నేపథ్యంలో రూపొంది మంచి విజయాన్ని అందుకుంది.
Advertisement
డీజే టిల్లు : సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన ఈ సినిమా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.
ఆర్ఆర్ఆర్ : రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్… కొమరం భీం పాత్రలో నటించాడు. కొమరం భీం తెలంగాణ ప్రాంతానికి చెందిన పోరాటయోధుడు. ఈ పాత్రలో ఎన్టీఆర్ నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది.
బలగం : ప్రియదర్శి హీరోగా కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్గా జబర్దస్త్ వేణు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ తెలంగాణ ప్రాంత నేపథ్యంలో రూపొందింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
దసరా : నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తెలంగాణ ప్రాంత నేపథ్యంలో రూపొంది అద్భుతమైన విజయం సాధించింది.