సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ బస్ కండక్టర్ గా పనిచేసి ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్న రజిని ఆ తర్వాత తన అద్భుతమైన స్టైల్ తో… నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించి ఒక్కో విజయాన్ని అందుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తనకంటూ నటుడిగా ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.
Advertisement
ప్రస్తుతం రజిని “జైలర్” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీని ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే రజిని తాజాగా నటుడు మరియు రచయిత అయినటువంటి వైజీ మహేంద్ర ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఆయన తన పర్సనల్ విషయాలను కూడా బయటపెట్టాడు.
Advertisement
అందులో భాగంగా రజిని తనకు ఉన్న చెడు అలవాట్ల గురించి క్లుప్తంగా చెప్పుకొచ్చాడు. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు రజిని కి ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ భోజనం విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అయ్యేవారు కాదట. రోజుకు రెండు పూటలు కనీసం భోజనానికి మటన్ ఉండాల్సిందేనట. ఒక వేళ మటన్ లేకపోతే ముద్ద దిగేది కాదట. అలాగే మటన్ తో పాటు కచ్చితంగా ఆల్కహాల్ కూడా ఉండవలసిందేనట. తిన్నాక పెగ్గు పడితే తప్ప నిద్ర వచ్చేది కాదట.
ఇక సిగరెట్ల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదట. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక పుష్కలమైన డబ్బు ఉండడంతో ఈ అలవాట్లకు పట్టపగ్గాలు లేకుండా పోయాయట. దానితో బ్రేక్ ఫాస్ట్ నుండే మటన్ ఉండేదట. ఇలా నాకు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు నుండే ఈ చెడు అలవాట్లు ఉన్నాయి అని ఇండస్ట్రీలోకి వచ్చాక అవి మరింతగా పెరిగాయి అని రజని చెప్పుకొచ్చాడు.