Home » సూపర్ స్టార్ కృష్ణతో సినిమా ఛాన్స్ ను జస్ట్ మిస్ చేసుకున్న అడవి శేషు… ఆ మూవీ ఏదో తెలుసా..!

సూపర్ స్టార్ కృష్ణతో సినిమా ఛాన్స్ ను జస్ట్ మిస్ చేసుకున్న అడవి శేషు… ఆ మూవీ ఏదో తెలుసా..!

by AJAY
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో అడవి శేషు ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. ఆ తర్వాత క్షణం మూవీతో సోలో హీరోగా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీలో అనసూయ విలన్ పాత్రలో నటించింది. ఆ తర్వాత గూడాచారి సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా మంచి విజయం అందుకుంది.

Advertisement

ఆ తర్వాత వరుసగా ఎవరు… మేజర్… హిట్ 2 మూవీలలో నటించిన ఈ యువ హీరో ఈ మూవీలతో కూడా విజయాలను అందుకున్నాడు. ఇలా క్షణం మూవీ దగ్గర నుండి వరుస విజయాలను అందుకుంటున్న అడవి శేషు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ కీజియేస్ట్ హీరోగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే అడవి శేషు కెరీర్లో మంచి విజయం సాధించిన సినిమాలలో గూఢచారి మూవీ ఒకటి. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా స్పై ద్రిల్లర్ నేపథ్యంలో రూపొందింది.

Advertisement

ఈ మూవీ ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ గా గూఢచారి 2 మూవీని రూపొందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి ఈ మూవీ మేకర్స్ ఒక చిన్న వీడియోని విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్ర కోసం ఈ మూవీ మేకర్స్ సూపర్ స్టార్ కృష్ణ ను సంప్రదించారట. కాకపోతే అప్పటికే అనారోగ్యం కారణంతో బాధపడుతున్న కృష్ణ నేను సినిమాలో నటించలేను అని చెప్పాడట. కాకపోతే మీరు సినిమాలో కేవలం రెండు రోజులు మాత్రమే నటించవలసి ఉంటుంది. అలాగే మీరు కూర్చొని చాలా హుందాగా … మీ శరీరానికి ఎలాంటి అలసట లేని పాత్ర ఈ సినిమాలో ఉంది అని చాలా బ్రతిమిలాడడంతో కృష్ణ గారు ఈ మూవీలో నటించడానికి ఒప్పుకున్నారట.

ఆ తర్వాత ఆయన పెద్ద కొడుకు చనిపోవడం … ఆ తర్వాత తన భార్య అయినటువంటి ఇందిరా దేవి చనిపోవడంతో చాలా మానసిక అలసటకు గురి అయిన కృష్ణ మరికొంత అనారోగ్యానికి గురయ్యాడట. అయినప్పటికీ ఇచ్చిన మాట తప్పకూడదు అని కచ్చితంగా మీ సినిమాలో రెండు రోజుల నటిస్తాను అని చెప్పాడట. కాకపోతే ఈ సినిమాలో నటించక ముందే కృష్ణ గారు అనారోగ్య కారణంతో చనిపోయారు. ఇలా కృష్ణతో నటించే అవకాశాన్ని జెస్ట్ లో యువ హీరో అడవి శేషు మిస్ చేసుకున్నాడట.

Visitors Are Also Reading