బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీం ఇండియా క్రికెటర్ పంత్ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా మధ్య కోల్డ్ వార్ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ అమ్మడు… పాక్ యంగ్ బౌలర్ తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆ సంగతులు కొంతకాలం నుంచి టీం ఇండియా క్రికెటర్ పంత్ తో మాటల యుద్ధానికి దిగిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ప్రతిరోజు వార్తల్లో నిలుస్తూ ఉంది.
Advertisement
సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ కు గురవుతూ ట్రెండ్ అవుతోంది. రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ విడిపోయారని అందుకే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారని అంతా అనుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా, 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లో అట్టహాసంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో తన అందాలతో ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది ఊర్వశి రౌతేలా.
Advertisement
ఇందులో మే 16న ఆమె పింక్ టల్లె గౌనులో అద్భుతంగా కనిపించింది. ముఖ్యంగా ఆమె ధరించిన మొసలి నెక్లెస్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఆమె ధరించిన మొసలి నక్లెస్ నకిలీదని కామెంట్స్ చేశారు. తాజాగా ఈ ట్రోల్స్ పై ఊర్వసి పిఆర్ టీం క్లారిటీ ఇచ్చింది. ఆమె ధరించిన నెక్లెస్ విలువలు రూ.276 కోట్లు అని పేర్కొంది. ఇక ఈ మొసలి నక్లెస్ ధర తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.