Home » తెలుగులో నా మొదటి సినిమా ఆ స్టార్ హీరోతో… కానీ అంత ఇస్తేనే చేస్తాను అన్నాను… పాన్నంబలం..!

తెలుగులో నా మొదటి సినిమా ఆ స్టార్ హీరోతో… కానీ అంత ఇస్తేనే చేస్తాను అన్నాను… పాన్నంబలం..!

by AJAY
Ad

తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నదుల్లో పోన్నంబలం ఒకరు. ఈయన ఎక్కువ శాతం సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించాడు. తన క్రూరమైన వేషాధారణతో… అంతకంటే క్రూరమైన డైలాగ్ డెలివరీతో ఈ నటుడు ఎంతో మంది ప్రేక్షకులను అలరించడంతో ఎన్నో సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్నో భాషల సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

Advertisement

ఇలా చాలా సంవత్సరాల పాటు సినిమాల్లో విలన్ పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ నటుడు తన సినీ కెరియర్ గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన మొదటి మూవీ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా పోన్నంబలం మాట్లాడుతూ… జిమ్నాస్టిక్స్ నేర్చుకుని అందులో చాలా పర్ఫెక్ట్ అయ్యాను. ఆ తర్వాత తమిళ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలాగే అప్పటికే ఎన్నో తమిళ సినిమాల్లో నటించాను.

Advertisement

అలాంటి సమయంలోనే తెలుగులో నాకు మొట్టమొదటిసారి మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో రూపొందిన ఘరానా మొగుడు సినిమాలో అవకాశం వచ్చింది. అయితే అందులో నాపై ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అయితే ఆ ఫైట్ సీన్ కోసం లక్ష రూపాయలు ఇస్తేనే చేస్తాను అని చెప్పేసాను. దానితో టీం అంతా షాక్ అయింది. మెగాస్టార్ చిరంజీవి హీరో… రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ ఇంత గొప్ప ఆఫర్ వచ్చినప్పుడు లక్ష రూపాయలు ఎందుకు అని కూడా చాలా మంది అన్నారు. కాకపోతే నేను మాత్రం లక్ష రూపాయలు ఇస్తేనే చేస్తాను అన్నాను. చివరకు ఆఫీసుకు వెళ్లి నేను ఫస్ట్ సీన్ చేస్తాను… అది నచ్చితేనే డబ్బులు ఇవ్వండి అని చెప్పాను. నాపై నాలుగు రోజులు ఫైట్ సీన్ చేశారు.

 

ఆ సీన్ అద్భుతంగా రావడంతో నాకు లక్ష రూపాయలు ఇచ్చారు. ఇది ఇలా ఉంటే ఘరానా మొగుడు సినిమా 175 రోజులు ఆడింది. ఆ తర్వాత ఫోన్ చేసి ఓసారి ఆఫీసుకు రమ్మన్నారు. వెళ్లాక డబ్బులు ఇచ్చారు. నేను నెక్స్ట్ మూవీ కి ఏమో అనుకున్నాను. ఆ డబ్బులు చూస్తే ఐదు లక్షలు ఉన్నాయి. వేరే వాళ్లకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చారేమో అని కాల్ చేస్తే… అది నీకు రావాల్సిన డబ్బే చిరంజీవి గారు గిఫ్ట్ గా ఇచ్చారు అని చెప్పారు. అలా చిరంజీవి గారి వల్ల ఘరానా మొగుడు సినిమాకు అంత మొత్తంలో గిఫ్ట్ అందుకున్నాను అని పోన్నంబలం తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు.

Visitors Are Also Reading