సౌత్ ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించిన వారిలో రమ్యకృష్ణ ఒకరు. ఈ నటి తెలుగు స్టార్ హీరోలతో పాటు తమిళ స్టార్ హీరోలతో కూడా ఎన్నో సినిమాలలో నటించి ఈ రెండు ఇండస్ట్రీలలో కూడా చాలా సంవత్సరాల పాటు తిరుగులేని స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈనటి అలాగే కొన్ని సినిమాల్లో తన అదిరిపోయే గ్లామర్ షోతో కూడా ప్రేక్షకులను అలరించింది.
Advertisement
అలాగే కొన్ని సినిమాల్లో విలన్ పాత్రల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. అందులో భాగంగా ఈ నటి సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమాలో విలన్ పాత్రలో నటించింది. ఈ మూవీలోని తన నటనకు గాను ఇప్పటికి కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో… రొమాంటిక్ పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈనటి ఇప్పటికి కూడా అనేక సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటూ అద్భుతమైన జోష్లో కెరియర్ ముందుకు సాగిస్తుంది.
Advertisement
ఇది ఇలా ఉంటే ఈనటి ఆ కాలంలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగిన రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సినిమాల్లో కూడా హీరోయిన్గా నటించింది. మరి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇప్పటికీ కూడా రమ్యకృష్ణ ఇంత స్టార్ డంతో కెరీర్ను కొనసాగిస్తుంది అంటే దానికి ప్రధాన కారణం రాఘవేంద్రరావు అని చెప్పవచ్చు… ఎందుకు అంటే ఈ నటి ఈయన దర్శకత్వంలో రూపొందిన సినిమాలతోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. అలా ఈ దర్శకుడు ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ నటి ఈయన దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాల్లో బికినీలో కూడా కనిపించింది.
కాకపోతే రాఘవేందర్రావు… రమ్యకృష్ణను బికినీలో చూపెట్టడానికి చాలా కష్టపడ్డాడట. మొదట ఈనటి వద్దన్నప్పటికీ ఇది లేటెస్ట్ ట్రెండ్.. ఇప్పుడు చాలామంది హీరోయిన్లు బికినీ వేసుకుంటున్నారు. ఇది వేసుకోవడం ద్వారా నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అలాగే చాలా గొప్ప గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తాయి అని ఈ దర్శకుడు చెప్పడంతో రమ్యకృష్ణ బికినీ వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అలా ఎంతో బ్రతిమలాడే రమ్యకృష్ణను బికినీలో ఈ దర్శకుడు చూపించాడట. రమ్యకృష్ణ ఆ సమయంలో బికినీ వేసుకోవడం ద్వారా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది.