Home » పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ?

పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ?

by Anji
Ad

కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన, తృణమూల్ కాంగ్రెస్,  జనతాదళ్ సహా మొత్తం 19 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. పార్లమెంట్ భవనం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. మే 28న జరగాల్సిన వేడుకను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి ప్రతిపక్షాలు. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న జాతీయ ఎన్నికలకు ముందు రాజకీయ ప్రకటన చేయడానికి అధ్యక్షుడు ద్రౌపది ముర్ముకు బదులు కొత్త పార్లమెంట్ ప్రారంభించేందుకు ప్రధాని మోడీ చేసిన ప్రణాళికలను ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. 

Advertisement

జాతిపిత మహాత్మగాంధీ నుంచి పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలను పంచుకున్న హిందుత్వ సిద్ధాంత కర్త వీడీ సావర్కర్ జయంతి సందర్భంగా ఈవెంట్ షెడ్యూల్ చేయడాన్ని కూడా కొందరూ విమర్శించారు. ముఖ్యంగా  భారత జాతీయ కాంగ్రెస్, . ద్రవిడ మున్నేట్ర కజగం, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన, సమాజ్ వాద్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, జార్ఖండ్ ముక్తి మోర్చా, కేరళ కాంగ్రెస్, విడుతలై చిరుతైగల్ కట్చి, రాష్ట్రీయ లోక్ దళ్, తృణమూల్ కాంగ్రెస్, జనతాదళ్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ జనతా దళ్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, నేషనల్ కాన్ఫరెన్స్, రివల్యూషనరీ సోషనలిస్ట్ పార్టీ, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం ఈ 19 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. 

Advertisement

రాజ్యాంగంలోని ఆర్టికల్ 79 ప్రకారం.. యూనియన్ కి రాష్ట్రపతి, రెండు సభలు ఉండే పార్లమెంట్ ఉండాలి అని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్ చేశారు. భారత రాష్ట్రపతి పార్లమెంట్ ను పిలిపించినప్పుడే అది సమావేశం అవుతుంది. రాష్ట్రపతి ప్రతీ సంవత్సరం సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా పార్లమెంటరీ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం ప్రతీ ఏడాది పార్లమెంట్ చేసే మొదటి వ్యాపార లావాదేవీ అని ట్వీట్ చేశారు. పార్లమెంట్ గురించి పలువురు రాజకీయాలు  ట్వీట్ చేస్తున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

మోహన్ బాబుని దారుణంగా అవమానించిన మ్యూజిక్ డైరెక్టర్.. ఎవరంటే..!!

Chanakya Niti : వీరు విజయం సాధించేందుకు ఉపయోగపడే లక్షణాలు ఇవే..!

Visitors Are Also Reading