ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటుడు శరత్ బాబు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా శరత్ బాబు మే 22న తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమ అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. తెలుగు ఇండస్ట్రీలో తన సహజ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు శరత్ బాబు. ప్రధానంగా ఎలాంటి కాంట్రవర్సిలకు తావు ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లేవారు అని సహనటులు పేర్కొంటున్నారు.
Advertisement
హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వంటి పాత్రల్లో నటించిన శరత్ బాబు దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు. చివరిసారి నరేష్, పవిత్ర లోకేష్ నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో నటించారు. ఈ సినిమా మే 26, 2023న విడుదల కాబోతుంది. శరత్ బాబు నటించిన సినిమా విడుదల కాకముందే ఆయన మరణంతో సినీ లోకం కంటతడి పెట్టుకుంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం శరత్ బాబు భౌతిక కాయాన్ని హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో ఉంచారు. రాత్రి ఆయన భౌతిక కాయాన్ని చెన్నైకి తరలించారు. శరత్ బాబు అంత్యక్రియలు చెన్నైలోని ఇండస్ట్రియల్ శ్మశాన వాటికలో నిర్వహించారు. చెన్నైలో పలువురు భౌతిక కాయానికి పలువురు కోలీవుడ్ స్టార్ హీరోలు విచ్చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజినీకాంత్.. శరత్ బాబుతో ఉన్నటువంటి అనుబంధం గురించి మాట్లాడారు.
Advertisement
ముఖ్యంగా శరత్ బాబు భౌతిక కాయాన్ని చివరి సారిగా చూసిన రజినీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం రజినీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీ ఒక మంచి స్టార్ ని కోల్పోయింది. శరత్ బాబు చాలా మంచి మనిషి అని.. ఆయనలో నేను ఎప్పుడూ కోపాన్ని చూడలేదు. నా పట్ల ఎంతో అప్యాయతతో ఉండేవారు. ముత్తు, అన్నామలై, వేలైక్కారన్ వంటి పలు సినిమాల్లో కలిసి నటించాం. మేము ఇద్దరం మంచి స్నేహితులుగా ఉండేవారం. ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. నాకు సిగరెటు కాల్చే అలవాటు ఉండేది. నేను ఎప్పుడూ సిగరేట్ కాల్చినా లాగి అవతల పడేసే వాడు. సిగరేట్స్ కాల్చితే ఆరోగ్యానికి ప్రమాదమని సున్నితంగా హెచ్చరించేవాడు. మా మధ్య ఎన్నో ఏళ్లుగా స్నేహబంధం కొనసాగుతూ వస్తుంది. శరత్ బాబు మృతి తట్టుకోలేకపోతున్నా’ అంటూ ఎమోషన్ కి గురయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
శరత్ బాబు చివరి సినిమా ఏంటో మీకు తెలుసా ?
ఆ సినిమాలో సావిత్రికి చెల్లలి పాత్ర అనగానే నాగేశ్వరరావు గారు ఏమి చేసారంటే ?