తమిళంలో శివాజీ గణేశన్ , జెమినీ గణేశన్ సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించిన హిట్ సినిమా పాశమలర్. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే భారీ నాటకీయ చిత్రం ఇది. సినిమా నిర్మాత డూండీ తమిళ చిత్రం హక్కులు కొని, రచయితగా అప్పటికి సినీ రంగానికి పూర్తిగా కొత్తవారైన ముళ్ళపూడి వెంకటరమణను నియమించుకున్నారు. అయితే భారీ నాటకీయత, శోకభరితమైన సన్నివేశాలు ఉన్న హెవీ డ్రామా సాహిత్య రంగంలో హాస్య రచయితగా పేరొందిన ముల్లపూడి వల్ల ఏమవుతుందని పరిశ్రమ వర్గాలు పెదవి విరిచిన , డూండీ మాత్రం హాస్యం , విరుపు తెలిసినవాడే హెవీ డ్రామా రాయగలడు అంటూ ప్రోత్సహించారు.
తమిళ స్క్రిప్ట్ అందగానే తీర్చిదిద్దిన రమణ.. తెలుగు స్క్రిప్టును ముఖ్యమైన షాట్ విభజనలు సూచించడంతో పాటు సినిమాను దాదాపు రెండు వారాల్లో రాశారు. దర్శకుడు వి. మధుసూదనరావు స్క్రిప్ట్ అయినంతవరకు తీసుకురమ్మని రెండు వారాలకు అడగగానే, మొత్తం స్క్రిప్ట్ చేతిలో పెట్టడంతో ఒకేసారి స్క్రిప్ట్ చూసి ఒకే చేసేశారు. ఆ తర్వాత నిర్మాత డుండి ఫ్యామిలీ, సెంటిమెంట్ పాత్రలకు పెట్టింది పేరైనా అక్కినేని నాగేశ్వరరావుని వెళ్లి కలిశారు. పాశమలార్ తమిళ చిత్ర కథను అక్కినేనికి వినిపించారట. ఈ సినిమాలో అన్న చెల్లెలు సెంటిమెంట్ తో ఉండడం వల్ల చెల్లి పాత్రలో సావిత్రిని తీసుకుంటున్నామని అక్కినేనితో చెప్పడంతో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. గతంలో తను, సావిత్రి చాలా చిత్రాల్లో హీరో, హీరోయిన్ గా నటించామని ఇప్పుడు ఒక్కసారిగా అన్నాచెల్లెళ్లుగా తెరపై కనిపిస్తే ప్రేక్షకులు తిరస్కరిస్తారేమోనని అక్కినేని సందేహాన్ని వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement
ఇదే తమిళ చిత్ర కథని మరో స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ కు చెప్పడంతో ముందు సందేహం వ్యక్తం చేసినప్పటికీ.. కథ బాగా నచ్చడంతో సావిత్రిని చెల్లెలి పాత్రకు ఎన్టీఆర్ ఓకే చేసేశారు. సరిగ్గా 6 నెలల క్రితమే ఎన్టీఆర్ , అక్కినేని నటించిన మల్టీ స్టారర్ చిత్రం గుండమ్మ కథ విడుదలైంది. ఇందులో ఎన్టీఆర్ కు జోడిగా సావిత్రి నటించగా.. అక్కినేనికి జోడిగా జమున నటించింది. అయినా ఎన్టీఆర్ ధైర్యంగా ఆయనతో సావిత్రి చెల్లెలిగా నటించడానికి ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ సరసన దేవిక నటించారు. సావిత్రి సరసన కాంతారావు నటించారు. వి.మధుసూదనరావు దర్శకత్వంలో 1962 లోవచ్చిన రక్తసంబంధం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్, సావిత్రి అన్నాచెల్లెళ్లుగా నటించి ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఘంటసాల స్వరపరిచిన బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్లి జరిగేనే ఇప్పటికీ కొన్ని సినిమాల్లో పెళ్లికి సంబంధించిన సన్నివేశం రాగానే బ్యాక్ గ్రౌండ్ లో ఈ పాట రావడం సహజం అయిపోయింది. ఏది ఏమైనప్పటికీ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలోనైనా లీనమైపోతాడనడటంలో ఎలాంటి సందేహం లేదు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
శరత్ బాబు, రమాప్రభ ఎందుకు విడిపోయారో తెలుసా ?