Home » కర్ణాటక సీఎంమ్మ మజాకా.. విమర్శిస్తూ పోస్ట్ పెట్టిన టీచర్ నిమిషాల్లో సస్పెండ్..!

కర్ణాటక సీఎంమ్మ మజాకా.. విమర్శిస్తూ పోస్ట్ పెట్టిన టీచర్ నిమిషాల్లో సస్పెండ్..!

by Sravanthi
Ad

కర్ణాటకలో కాంగ్రెస్ సంచలన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ విజయంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. కర్ణాటకలో ఇప్పటివరకు ఎప్పుడూ 135 సీట్లు సాధించి వన్ సైడ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ మాత్రమే. ఈ తరుణంలో అధిష్టానం నిర్ణయం మేరకు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగికి సస్పెన్స్ ఆర్డర్స్ వెళ్లాయి. ఇంతకీ జరిగిందేంటయ్యా అంటే..

Advertisement

చిత్రదుర్గ జిల్లాకు చెందిన శాంతన మూర్తి ఎంజి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రభుత్వం ప్రకటించిన ఉచితాల వల్ల రాష్ట్రంపై భారం పడుతుందని ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. ఆ పోస్టులో ఎస్ఎం కృష్ణ సీఎంగా ఉన్నప్పుడు 3,570 కోట్లు అప్పు ఉంది. కుమారస్వామి, ధరమ్ సింగ్, యడ్యూరప్ప,సదానంద గౌడ, జగదీష్ సెట్టర్, హయాంలో ఈ అప్పులు వేల కోట్లకు పెరిగిపోయాయి. ఇక సిద్ధరామయ్య హాయంలో 2,42,000 కోట్ల రూపాయలకు చేరింది. ఇదంతా సిద్ధరామయ్య టైంలో ఉచితల కారణంగా ఇలా జరిగిందని రాసుకోచ్చారు.

Advertisement

ఇదంతా తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే రాష్ట్ర పౌర సేవల శాఖ, ప్రవర్తన నియమాలను ఉల్లంఘించినందుకు ఆ ప్రభుత్వ ఉద్యోగికి సస్పెన్స్ ఆర్డర్స్ వచ్చాయి. శాంతనమూర్తి తీరుపై శాఖ పరమైన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే ఐదు హామీలను నెరవేరుస్తానని సిద్ధరామయ్య గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
మరికొన్ని ముఖ్య వార్తలు:

 

Visitors Are Also Reading