మోస్ట్ బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరు అయినటువంటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈటీవీలో ప్రసారం అయిన “ఢీ” డాన్స్ ప్రోగ్రాం తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మలయాళం ప్రేమమ్ సినిమాలో హీరోయిన్గా నటించింది.
Advertisement
ఈ మూవీ మంచి విజయం సాధించడం… అలాగే ఇందులో తన నటనతో సాయి పల్లవి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా ఈనటికి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ నటి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందినటువంటి ఫిదా మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడం… ఇందులో తన నటనతో, డాన్స్ తో ఈ నటి ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ తోనే సాయి పల్లవి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది.
Advertisement
ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక సినిమాలలో నటించి ఏ సినిమాలో కూడా గ్లామర్ షో చేయకుండా సాంప్రదాయ బద్ధమైన పాత్రల్లో నటిస్తూ సాయి పల్లవి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకుంది. ఇకపోతే ఈ నటి సినిమాల ద్వారా చాలా మొత్తంలో ఆస్తులను కూడబేట్టినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం సాయి పల్లవి సినిమాకు రెండు కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే సాయి పల్లవి ఎక్కువ 2020 వ సంవత్సరంలో ఎక్కువ డబ్బులను పోగు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క సంవత్సరంలోనే ఈనటి 26 కోట్ల డబ్బులను సంపాదించినట్లు తెలుస్తోంది. అలాగే సాయి పల్లవికి ఇప్పటికే ఎన్నో స్థిర , చర ఆస్తులు కూడా ఉన్నాయంట.