Home » బాలీవుడ్ స్టార్ హీరోకు క‌రోనా పాజిటివ్‌..!

బాలీవుడ్ స్టార్ హీరోకు క‌రోనా పాజిటివ్‌..!

by Anji
Published: Last Updated on
Ad

దేశంలో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం క‌రోనా బారిన ప‌డుతున్నారు. బాలీవుడ్‌లో ఇప్ప‌టికే క‌రీనా క‌పూర్, అర్జున్ క‌పూర్, స‌న్యాక‌పూర్‌, మృనాల్ ఠాకూర్‌, నోరా ఫ‌తేహి, శిల్పా శిరోద్క‌ర్‌ల‌తో స‌హా ప‌లువురు ప్ర‌ముఖులకు కొవిడ్ పాజిటివ్ నిర్థార‌ణ అయిన విష‌యం విధిత‌మే. తాజాగా హీరో జాన్ అబ్ర‌హంతో పాటు అత‌ని భార్య‌కు క‌రోనా పాజిటివ్ సోకింది. ఈ విష‌యాన్ని జాన్ అబ్ర‌హం ఇన్‌ స్టా వేదిక‌గా వెల్ల‌డించారు.

John Abraham And His Wife Infected With Corona Information Given On Social  Media | John Abraham Corona Positive: जॉन अब्राहम और उनकी पत्नी हुए कोरोना  से संक्रमित, सोशल मीडिया पर दी जानकारी

Advertisement

Advertisement

మూడు రోజుల కింద‌టే తాను ఓ వ్య‌క్తిని క‌లిశాను అని, అతనికి పాజిటివ్‌గా తేల‌డం వ‌ల్ల తాను, భార్య ప్రియ వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్నాం అని పేర్కొన్నారు. దీంతో ఇద్దరికీ కొవిడ్ పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. ప్ర‌స్తుతం గృహ నిర్బంధంలో ఉన్నాం అని జాన్ అబ్ర‌హం తెలిపారు. అభిమానులంద‌రూ మాస్క్‌లు ధ‌రించి జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. జాన్ అబ్ర‌హం న‌టించిన స‌త్య‌మేవ జ‌య‌తే 2 జ‌న‌వ‌రి 25న విడుద‌ల కావాల్సి ఉన్న‌ది. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఆదివారం ద‌ర్శ‌కుడు రాహుల్ రావైల్ (70) కూడా కొవిడ్ బారీన ప‌డ్డారు. రాహుల్ రావైల్ 1983లో అర్జున్‌, 1985లో బేతాబ్‌, 1991లో మ‌స్త్ క‌లంద‌ర్ వంటి చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Visitors Are Also Reading