సాధారణంగా పోషకాహారం తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం. జుట్టు చర్మ సమస్యలకు మన జీవనశైలిలో కలిగే మార్పులే అని చెప్పవచ్చు. బలహీనంగా ఉండడం శరీరంలో రక్తం తగ్గిపోవడం, రక్తహీనత, హిమోగ్లోబిన్ తగ్గిపోవడం వల్ల జుట్టు రాలడమం అలసట నీరసం, నిద్రలేమి, ఒత్తిడి వంటి సమస్యలు ఐరన్ లోపం వల్ల వస్తాయి. ముఖ్యంగా ఈ సమస్య అధికంగా ఉంటుంది. ప్రధానంగా స్త్రీలు ఎక్కువగా ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతుంటారు. ఐరన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది. ఐరన్ లోపం వల్ల జుట్టు చర్మంపై చాలా ప్రభావాలు చూపిస్తుంది. ఐరన్ లోపం వల్ల కొన్ని లక్షణాలను ఇలా గుర్తించవచ్చు అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మన శరీరంలో ఐరన్ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఐరన్ లోపం ఉన్నప్పుడు ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. దీంతో ఆక్సిజన్ చర్మ కణాలకు చేరదు. కళ్ళ చుట్టూ చర్మం నల్లగా మారడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అదేవిధంగా నల్లని వలయాలు కూడా ఏర్పడతాయి. ఐరన్ లోపం వల్ల చర్మంపై తామర వంటి సమస్యలు కూడా కలుగుతాయి. శరీరంలో ఐరన్ లేకపోవడం వల్ల చర్మం కాంతి తగ్గి పాలిపోయినట్టు ఉంటుంది. ఐరన్ లోపం వల్ల చర్మం పొడిగా మారే అవకాశం ఉంది. దద్దుర్ల సమస్యలు కూడా కలుగుతాయి.
Advertisement
ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తి అనేది తగ్గుతుంది. హిమోగ్లోబిన్ శరీరంలోని కణాలకు ఆక్సిజన్ అందిస్తుంది. ఐరన్ వల్ల జుట్టు పెరుగుదల జరుగుతుంది. ఐరన్ లోపం వల్ల జుట్టు నిర్జీవంగా మారడం ఎక్కువగా రాలిపోవడం చోటు చేసుకుంటుంది. బలహీనంగా అనిపించడం అలసట నీరసం జుట్టు రాలడం చర్మ సమస్యలు నిద్రలేమి ఒత్తిడి కంగారు కాళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఆహారంలో వీలైనంత ఎక్కువ ఐరన్ ఉండేటట్టు తీసుకోవాలి. ఆహారాలు, కాయ ధాన్యాలు, బీన్స్, పాలకూర, తృణధాన్యాలు
వంటి పదార్థాలను తీసుకోవాలి. ఈ ఆహార పదార్థాలను తీసుకున్నట్టయితే హిమోగ్లోబిన్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు :
పెరుగుతో కలిపి ఈ ఆహారపదార్థాలను అస్సలు తినకూడదు..!
హీరో సుమన్ కూతురు ఆ స్టార్ హీరో ఇంటి కోడలు కాబోతుందా ?