పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కరుణాకరణ్ దర్శకత్వంలో నటించిన మూవీ “తొలిప్రేమ”. ఈ సినిమాలో కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది. పవన్ సిస్టర్ బుజ్జి పాత్రలో వాసుకి నటించింది. ఈ చిత్రంలో వాసుకీ పాత్రకు కూడా మంచి పేరు రావడంతో ఆమె మరికొన్ని సినిమాల్లో నటిస్తుందని భావించారు. ఆమె ఆర్ట్ డైరెక్టర్, పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఆనంద్ సాయిని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
Also Read : చిరంజీవిది గొప్ప మనసు…”యముడికి మొగుడు” టైంలోనే ఆ పని చేశాడుగా…?
Advertisement
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్ట్ యాదాద్రి నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం. ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడిని లక్షలాది భక్తులు దర్శించుకుని స్వామి వారి కృపను పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా శిథిలావస్థలో ఉన్న ఆలయాల పునర్నిర్మాణానికి కంకణం కట్టిన రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్టపై నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం పై ప్రత్యేక దృష్టి పెట్టింది. అలాంటి దైవ కార్యాన్ని నెరవేర్చే బాధ్యతను ఆర్ట్ డైరెక్టర్, అర్కిటెక్ట్ ఆనంద్ సాయికి సీఎం కేసీఆర్ అప్పగించారు. ఈ అద్బుతమైన, చారిత్రాత్మకమైన ప్రాజెక్టులో తన భర్త ఆనంద్ సాయితో కలిసి నటి వాసుకి ఓ బాధ్యతను ఆమె కూడా భుజానికి ఎత్తుకొన్నారు.
Advertisement
యాదాద్రి ఆలయ నిర్మాణం సమయంలో ప్రతీ మీటింగ్‌కు ఆమె వెళ్లారు. అధికారులు, నిపుణులు ఆలయం గురించి, దాని ప్లాన్ గురించి చెబుతుంటే.. ఆనంద్ సాయి వింటూ పేపర్‌పై వెంటనే డిజైన్ గీస్తుండేవాడు. ఆయన ఎక్కువగా వినరు. అధికారులు చెప్పిన ప్రతీ విషయాన్ని నోట్ చేసుకొనేది. మీటింగ్ పూర్తయ్యే సమయానికి ఆనంద్ సాయి ఆలయ డిజైన్ గీసి ఇచ్చేవారు. వాసుకి నోట్ చేసుకొని మీటింగ్ మినట్స్‌ను అధికారులకు ఇచ్చేది. అలా తన భర్త పనుల్లో.. సహాయపడుతుండేది. అందుకే వాసుకి తొలిప్రేమలో కనిపించిన తర్వాత ఆమె తిరిగి మరో తెలుగు సినిమాలో కనిపించలేదు.
Also Read : నాగశౌర్య ‘రంగబలి’కి రెడీ.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే ?